వేలంలో మల్లయ్య తాత  కార్లు..! - MicTv.in - Telugu News
mictv telugu

వేలంలో మల్లయ్య తాత  కార్లు..!

August 28, 2017

ఆ రండి బాబు రండి.. ఇంతకంటే అగ్గువ మాల్ మీకు ఇంకేడ దొర్కది.. సూస్తె సెకండ్ హ్యాండే గనీ, కూసుంటే లగ్జరీ ఆనందం. పాత ఓనరు  మందిని, బ్యాంకులను ముంచిన బట్టెవాజే  గావచ్చు… కనీ ఈ కార్ల మీరెక్కి తిర్గితే  అందరు పర్శానై జూసుడు మాత్రం ఖాయం. ఇగో ఇట్ల విజయ్ మాల్యాకు చెందిన  రొండు కార్లను వేలం వేసిన్రు. 32 లక్షలు ఖరీదు జేసే కార్లకు వేలం పాటల ఉత్త  లక్షా నలభై వేలే అచ్చినయట.

అవుమరీ మందిని ముంచిన.. దొంగ తిర్గిన కార్లాయ.  గంతకంటే ఎక్కువస్తయా? ముంబైకి చెందిన పారిశ్రామిక వేత్త హనుమంతరెడ్డి అనేటాయ్న ఈ రొండు కార్లను సొంతం జేస్కున్నడట. కనీ  గన్ని లక్షలు ఖరీదు జేశే కార్లమ్ముతనే  రొండు లక్షలు గుడ రాలెవ్వు. ఇగ విజయ్ మల్యా.. భవంతులు,ఆస్తులు  వేలం పాటలేస్తే  ఆయన ముంచిన 9000 కోట్లకు అసలు కాదుకదా  ఈ లెక్కన  కొసరు మిత్తిగుడ రాదు గావచ్చు.