జగన్‌ను 2 లక్షల మెజారిటీతో ఓడిస్తా.. రఘురామ  - MicTv.in - Telugu News
mictv telugu

జగన్‌ను 2 లక్షల మెజారిటీతో ఓడిస్తా.. రఘురామ 

October 20, 2020

Defeat Jagan with a majority of 2 lakhs .. Raghurama Krishnam raju

నర్సాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ సవాల్ విసిరారు. అమరావతి అంశం రిఫరెండంగా ఎన్నికలకు వెళ్తే  జగన్‌ను 2 లక్షల భారీ మెజారిటీతో ఓడిస్తానని అన్నారు. 

ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. జడ్జి స్వామి రాసిన పుస్తకంలోని అంశాలను సాక్షి దిన పత్రిక ప్రచురించడం సమంజసం కాదని  అన్నారు. రాజ్యాంగం ప్రకారం మత సంస్థలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకూడదని రఘురామ స్పష్టంచేశారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో మతం ప్రకారమే తన పదవిని వేరే ఎంపీకి ఇచ్చారని, అందులో గొడవవేమీ లేదని అన్నారు. 

ఎంపీ పదవి నుంచి తననెవరు తొలగించలేరని,  పార్టీ నుంచి కూడా బహిష్కరించలేరని స్పష్టంచేశారు. బడా కాంట్రాక్టర్లకు ఇసుక టెండర్లను అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉందని ఆయన ఆరోపించారు. అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  ఆ వ్యక్తులెవరో తెలుసుకుని విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. 

పుంగనూరు వ్యవహారంపైనా ఆయన స్పందించారు. అక్కడ కొత్తగా బైపాస్ రోడ్డు నిర్మిస్తే.. దాని చుట్టుపక్కల భూములన్నీ ఓ రెడ్డి నాయకుడు ముందుగానే కొనుగోలు చేసినట్లు తెలిసిందన్నారు. ‘చిత్తూరు జిల్లాలో పాల వ్యాపారంలో బాగా పేరొందిన ఓ వైసీపీ నేత.. తన కంపెనీవి కాకుండా వేరే పాల వ్యాన్లు అటుగా వెళితే డ్రైవర్లు, క్లీనర్లను కొడతామని బెదిరిస్తున్నారట. అవసరమైతే లారీలను సైతం దండిస్తారట. ఇప్పుడా పాల వ్యాపారి.. పండ్ల వ్యాపారంలోకి ప్రవేశించి, రైతుల నుంచి పంటలను దోచుకుంటున్నారట. ఆ కుటుంబం నుంచి ఒకరు ముఖ్యమంత్రి రేసులో కూడా ఉన్నారు. కోర్టు ధిక్కార నేరం కింద జగన్ జైలుకు పోతే.. ఆ చిత్తూరు నేతతో పాటు జగన్ కుటుంబీకులు సీఎం రేసులో ఉన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలపై అనుచిత ఫిర్యాదులు కోర్టు ధిక్కరణ కిందికే వస్తాయి. ఆ నేరానికి పాల్పడిన జగన్ ముఖ్యమంత్రి సీటు నుంచి దిగిపోవాల్సి ఉంటుంది’ అని రఘురామ వ్యాఖ్యానించారు.