‘డిగ్రీ కాలేజ్’ పోసర్లు అశ్లీలమంటూ.. తెలుగు దర్శకుడిపై కేసు  - MicTv.in - Telugu News
mictv telugu

‘డిగ్రీ కాలేజ్’ పోసర్లు అశ్లీలమంటూ.. తెలుగు దర్శకుడిపై కేసు 

February 5, 2020

ఈ నెల 7న విడుదల కాబోతున్న ‘డిగ్రీ కాలేజ్’ సినిమాపై ఇప్పటికే విమర్శలు వచ్చాయి. తాజాగా దర్శకుడు నరసింహ నందిపై ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మూవీ పోస్టర్లు అత్యంత అశ్లీలంగా ఉన్నాయని, వాటిని కుర్రవాళ్లు ఎక్కువగా తిరిగే అమీర్‌పేట మైత్రీవనం కూడలి వద్ద పెద్ద సంఖ్యలో అంటించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. డైరెక్టర్‌ నరసింహ నంది, నిర్మాత శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని కొందరు పోలీసులను కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టర్లకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. 

వరుణ్‌, దివ్యరావు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఇటీవలే  ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. దీని ట్రైలర్ అశ్లీలంగా ఉందని విమర్శలు వచ్చాయి. నరసింహ నంది ఇదివరకు ‘హైస్కూల్‌’, ’కమలతో నా ప్రయాణం’ , ‘లజ్జ’ సినిమాలు తీశారు. ‘1940లో ఒక గ్రామం’ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును కూడా అందుకున్నారు. అయితే ట్రెండును బట్టి ఆయన కూడా డిగ్రీ కాలేజ్ కోసం అడల్ట్ కంటెంట్ చొప్పించినట్లు అర్థమవుతోంది.