Home > Featured > ‘పోవే పోరా’ పొయ్యేకాలం!అమ్మాయిలు కుక్కలు.. అబ్బాయిలు దున్నపోతులు

‘పోవే పోరా’ పొయ్యేకాలం!అమ్మాయిలు కుక్కలు.. అబ్బాయిలు దున్నపోతులు

హాస్యం అపహాస్యం అవుతోంది. వినోదం పేరుతో వికృతాలకు పాల్పడుతున్నారు. కులమతాలను, ప్రాంతాలను, అణగారిన వర్గాలను కించపరుతున్నారు. ముఖ్యంగా కొన్ని తెలుగు టీవీ చానళ్లలో వస్తున్న వినోద కార్యక్రమాలు కేవలం బూతులకు మాత్రమే పరిమితం కాకుండా ఇప్పటికే మర్రిచెట్లు ఊడళ్లా విస్తరించిన వివక్షను మరింతగా పెంచేస్తున్నాయి. ఈటీవీ జబర్దస్త్‌ షోలో చెప్పే డైలాగులు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. వాటిపై వివాదాలూ రేగి, పోలీస్ స్టేషన్ దాకా వెళ్లారు బాధితులు. అతిగా

తాజాగా ఈటీవీలోనే ప్రసారమయ్యే ‘పోవే, పోరా’లోనూ వివాదాస్పద డైలాగులు చెబుతున్నారు. భ్రూణహత్యలు, వర్నకట్న చావులు వంటి దుర్మార్గాలతో అడుగడుగునా వివక్షకు గురవుతున్న అమ్మాయిలను మొరిగే కుక్కలతో పోలుస్తూ ఓ మనిషి చెప్పిన డైలాగులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడు..ఓ అమ్మాయితో ‘కవిత్వం’ చెబుతూ.. ‘అరటికాయలో ఉంటాయి తొక్కలు, మటన్‌లో ఉంటాయి ముక్కలు, తమలపాకులో పెడతారు వక్కలు, ఈ అమ్మాయిలందరూ మొరిగే కుక్కలు..’ అని అన్నాడు. దీనికి ఆమె అమ్మాయిలను కుక్కలు అన్నందుకు ఏమాత్రం ఫీల్ కాకుండా ‘మీకు లేవు పిక్కలు, బొక్కలు..’ అని యతిప్రాసల కవిత్వాన్ని అప్పగించింది. తర్వాత ఓ అమ్మాయి అందుకుని ‘గుడిలో ఉంటాయి జ్యోతులు, చెట్టుమీద ఉంటాయి కోతులు. ఈ మగాళ్లంతా దున్నపోతులు..’ అని సెలవిచ్చింది. దీనిపై నెటిజన్లు, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఆ డైలాగ్ చెప్పిన మనిషి, రాసిన మనిషిని కన్న తల్లులు కూడా ఒకప్పుడు అమ్మాయిలేనని గుర్తు చేస్తున్నాయి. మగవాళ్లంతా దున్నపోతులు అనడం కూడా తప్పేనని, తండ్రులను, సోదరులను కించపరచడమేనని అంటున్నారు. ఇలాంటి చెత్త డైలాగులు మానకపోతే న్యాయపరమైన చర్యలు దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

గతంలో జబర్దస్త్‌లో షోలో హైపర్ ఆది అనాథలను అవహేళన చేస్తూ ‘అతిగా ఆవేశపడే ఆడదానికి, అతిగా ఆశపడే మగాడికి పుట్టే సంతానమే అనాథలు’ అని అన్నాడు. దీనిపై అనాథలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత అదే షోలో.. గల్ఫ్ కార్మికులను కించపరిస్తూ తల్లి పాత్ర పోషించిన అవినాశ్ తన కొడుకు పాత్రను తిడుతూ ‘పక్కింటి సురేశ్ భార్యను వదలి గల్ఫ్ వెళ్లి పని చేసుకుంటున్నాడు, నువ్వు పడుకుని నిద్రపోతున్నావు..’ అని అంటాడు. దీంతో కొడుకు పాత్ర పోషిచిన రాజు… ‘వాడు జాబ్ చూసుకుంటున్నాడు, వాడి పెళ్లాన్ని నేను చూసుకుంటున్నాను.. ’ అని బదులిస్తాడు. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నటులను ఉద్దేశించి ‘మీరు రోజుల తరబడి జబర్దస్త్ షూటింగ్ కు వెళ్లినప్పుడు మీ భార్యలను ఎవరు చూసుకుంటున్నారు?’ ఘాటు స్పందనలే వచ్చాయి.

Updated : 22 Aug 2019 5:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top