Degree student lost legs after standing for 9 hours in vemulawada
mictv telugu

లెక్చరర్ చేసిన పనికి.. రెండు కాళ్లు కోల్పోయింది.. కలెక్టర్ సీరియస్

August 29, 2022

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సాంఘిక గురుకుల కళాశాలలో అవమానీయ ఘటన చోటుచేసుకుంది. జ్వరంతో బాధపడుతూ అదనంగా రెండు రోజులు సెలవులు తీసుకుందన్న కారణంగా ఓ విద్యార్థినిని.. కాలేజ్ మహిళా లెక్చరర్ వేయకూడని శిక్ష వేసింది. ఐదురోజులు పాటు వరుసగా 9 గంటలు క్లాస్ రూమ్ బయట నిలబెట్టింది. ఫలితం.. ఆ విద్యార్థిని కాళ్లలో స్పర్శ కోల్పోయింది. కాళ్లు చచ్చుబడటంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వేములవాడలోని గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఆదివారం వెలుగు చూసింది.

బీకాం చివరి సంవత్సరం చదువుతున్న నిహారిక జ్వరం కారణంగా రెండ్రోజులు సెలవులు తీసుకొంది. లీవ్ ముగిసిన తర్వాత ఆలస్యంగా వచ్చినందుకు 5 రోజులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6 వరకు నిలబెట్టి కామర్స్ లెక్చరర్ శిక్షించారు. అలాగా ఇన్ని గంటలు నిల్చోవడం వల్ల కాళ్లకు రక్త ప్రసరణ ఆగి విద్యార్థిని అక్కడికక్కడే పడిపోయింది. దీంతో ఆస్పత్రికి తీసుకోని వెళ్లడంతో చికిత్స చేసిన డాక్టర్లు కాళ్లు చచ్చుబడిపోయాయని తెలిపారు.

ఈ ఘటన జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి దృష్టికి వెళ్లడంతో దీనిని సీరియస్గా తీసుకున్నారు. సంబంధిత లెక్చరర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌ బయటే నిలబెట్టి నిహారిక అనారోగ్యానికి కారణమైన కళాశాల కామర్స్ లెక్చరర్ డీ మహేశ్వరిని విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. ఘటన జరిగిన సమయంలో వేములవాడ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న మాతంగి కల్యాణిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. విద్యార్థిని నిహారిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.