అందంగా లేనని శ్రీకాకుళం యువకుడి ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

అందంగా లేనని శ్రీకాకుళం యువకుడి ఆత్మహత్య

June 29, 2020

Degree student passed away in srikakula

మనుషుల బాహ్య అందానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్న రోజులివి. దీంతో నలుపు రంగులో ఉన్నవారు ఎంతో మనోవేదనకు గురవుతున్నారు. పుట్టుకతో వచ్చిన తమ శరీర రంగును మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, కొందరు మాత్రం నలుపు ఉండడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేస్కుని మరణిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఓ సంఘటన జరిగింది. 

అందంగా లేనని, ముఖంపై మచ్చలు ఉన్నాయని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని మాణిక్యపురంలో చెందిన సునీల్‌ నాయక్‌ (20) డిగ్రీ చదువుతున్నాడు. అతడి ముఖంపై చిన్నప్పటి నుంచి మచ్చలు ఉండేవి. అందవిహీనంగా కనపడుతున్నానని ప్రతి రోజు బాధపడేవాడు. ఆ మచ్చలను తొలగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినప్పటికీ అవి తగ్గలేదు. దీంతో కాలేజీకి ముఖంపై కర్చీఫ్‌ కప్పుకునే వెళ్లేవాడు. తాను అందంగా లేకపోవడంతో భవిష్యత్తులోనూ తననందరూ చులకనగా చూస్తారని భావించాడు. ఈ బాధతోనే ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.