DELHI Airhostess issue case on acquaintance in Delhi accused arrested
mictv telugu

తనను రేప్ చేసినవాడి బంధించి పోలీసులకు ఫోన్..

September 27, 2022

అత్యాచారానికి గురైన 30 ఏళ్ల యువతి ధైర్యం కోల్పోకుండా చాకచక్యంతో వ్యవహించి రేపిస్టును కటకటాల్లోకి నెట్టించింది. ఢిల్లీలోని మొహ్రాలీలో ఈ సంఘటన జరిగింది. ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్న ఆమెకు, కాన్పూర్‌కు చెందిన హర్జీత్ యాదవ్ అనే రాజకీయ నాయకుడు ఇటీవల పరిచయమయ్యాడు. ఆమె స్నేహంతో అతణ్ని ఇంటికి ఆహ్వానించింది. అతడు కూడా మొదట్లో సోదరుడిలా చక్కగా మెలిగాడు. తర్వాత పాడుబుద్ధి సోకింది. ఇంట్లో ఆమె తప్ప ఎవరూ లేరని గమనించి, మద్యం మత్తులో అత్యాచారం చేశాడు. అతని పశుబలాన్ని ఎదిరించలేకపోయిన ఆమె తర్వాత గదిలోనే బంధించి పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు హుటాహుటిని అక్కడికి చేరుకుని అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు తన వివరాలను బయటపెట్టొద్దని కోరిందని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా బలమైన కేసులు నమోదు చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ చందన్ చౌదరి చెప్పారు.