బస్సు బోల్తా.. 29 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

బస్సు బోల్తా.. 29 మంది మృతి

July 8, 2019

బస్సు వంతెనపై నుంచి పడిపోయి 29 మంది మృతిచెందిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. యమునా ఎక్స్‌ప్రెస్ వేపై లక్నో నుంచి ఢిల్లీ 40 మంది ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు ఆగ్రా సమీపంలోని కుబేర్‌పూర్ దగ్గర బ్రిడ్జిపై నుంచి జర్న నాలాలో పడిపోయింది. 

ఈ ప్రమాదంలో 29 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో గాయపడ్డవారిని హాస్పిటల్‌కి తరలించారు.