సీఏఏ అల్లర్లు.. ఏడుగురి బలి, 100 మందికి గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

సీఏఏ అల్లర్లు.. ఏడుగురి బలి, 100 మందికి గాయాలు

February 25, 2020

caa protest

పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా ఒక వర్గం, మద్దతుగా వర్గం చెలరేడంతో దేశ రాజధాని ఢిల్లీ బిక్కుబిక్కుమంటోంది. అల్లర్లు ఈ రోజు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. గత 24 గంటల నుంచి సాగుతున్న ఘర్షణల్లో ఒక హెడ్ కానిస్టేబుల్ సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు దుకాణాలు కాలిపోయాయి. 

ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురా, చాంద్ బాగ్, కారవాల్‌ల్లో ఆందోళనకారులు రాళ్లతో కొట్టుకున్నారు. వీరిలో కొందరు మహిళలు కూడా ఉండడం విశేషం. వంది మందికిపైగా గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఆ ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. దీంతో ప్రభుత్వం ఆర్మీని మోహరిస్తుందనే వార్తలు వస్తున్నాయి. అయితే సరిపడా పోలీసు బలగాలు ఉన్నాయని, సైన్యాన్ని రంగంలోకి దింపే ప్రసక్తే లేని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు శాంతిసంయమనంతో వ్యవహరించాలని, పుకార్లు నమ్మొద్దని హోం శాఖ మంత్రి అమిత్ షా కోరారు. శాంతి భద్రతలపై ఆయన సీఎం కేజ్రీవాల్‌తో సమావేశమై చర్చించు. ఒక పక్క అమెరికా అధ్యక్షుడు నగరంలోనే ఉండడం, మరోపక్క అల్లర్లు సాగడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించే అవకాశముంది.