ఢిల్లీ అల్లర్లు.. మృతుల పేర్లు ఇవే, ఎక్కువ మంది కాల్పుల్లోనే - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీ అల్లర్లు.. మృతుల పేర్లు ఇవే, ఎక్కువ మంది కాల్పుల్లోనే

February 28, 2020

Delhi caa

ఈశాన్య ఢిల్లీ కుదుట పడుతోంది. అల్లరి మూకలు తోక ముడుస్తున్నాయి. సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు 42 మంది చనిపోగా 200 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో చాలా మంది తూటాలకు బలైన వారే. వీరిలో కూలీలు, విద్యార్థులు, వృద్ధులు, యువకులు ఉన్నారు. అల్లర్లలో స్థానిక నేరగాళ్లు కూడా పాల్గొన్నారు. రౌడీషీటర్లు, జులాయిలు ఇష్టారాజ్యంగా చెలరేగాయి. లైసెన్స్ లేని తుపాకులను వాడినట్లు తెలుస్తోంది పది రోజులకు ముందు నుంచే ఘర్షణలకు పథకం వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆప్ నేత తాహిర్ ఇంట్లో యాసిడ్ బాంబులు పెద్దసంఖ్యలో లభించడం కలకలం రేపుతోంది. 42 మంది మృతుల్లో 30 మంది పేర్లు, వివరాలు బయటకొచ్చాయి. 

జాబితా.. 

 1. ముబారాక్ హుస్సేన్(28), కూలి
 2. షాహిద్ ఖాన్ అల్వీ(2) ఆటో డ్రైవర్
 3. ముదాసిర్ ఖాన్ ఆటో డ్రైవర్
 4. నజీమ్ కాన్(35) స్క్రాప్ వ్యాపారి
 5. మహహ్మద్ ఫర్కువాన్(30)
 6. మెహతాబ్(22)
 7. రతన్ లాల్(42) హెడ్ కానిస్టేబుల్
 8. రాహుల్ సోలంకి.. సివిల్ ఇంజినీర్
 9. అంకిత్ శర్మ(26).. ఇంటెలిజెన్స్ బ్యూరో కానిస్టేబుల్
 10. అతుల్ గుప్తా(45)
 11. బీర్బన్(34)
 12. వినోద్ కుమార్(45) 
 13. వీర్ బాగ్ సింగ్(48)
 14. అష్ఫాక్ హుసేన్(24) ఎలక్ట్రీషియన్ 
 15. దీపక్ (34)
 16. ఇషాక్ ఖాన్(24)
 17. షాన్ మహమ్మద్ (34)
 18. పర్వేష్(48)
 19. జాకీర్(24)
 20. దిల్బర్
 21. రాహుల్ ఠాకూర్(23)
 22. అమన్(17)
 23. మారుఫ్(32)
 24. సల్మాన్
 25. ఫైజాన్(23)
 26. అలోక్ తివారి(34)
 27. ఇర్ఫాన్(25)
 28. బబ్బూ(34)
 29. అక్బారీ(85)
 30. అయూబ్ షబ్బీర్(60)