సీఎం ఇంట్లో రచ్చ.. చీఫ్ సెక్రటరీపై ఎమ్మెల్యేల దాడి - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం ఇంట్లో రచ్చ.. చీఫ్ సెక్రటరీపై ఎమ్మెల్యేల దాడి

February 20, 2018

విచక్షణ కోల్పోతే అంతే. చుట్టూ ఏం ఉన్నా, ఎవరున్నా పట్టించుకోరు. ఆవేశంలో చేయరాని పనులు చేసేస్తేంటారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో అందే జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై దాడి జరిగింది. సీఎం చూస్తుండగానే ఇద్దరు ఎమ్మెల్యేలు తనను చావగొట్టారని సీఎస్  అన్షు ప్రకాష్ ఫిర్యాదు చేశారు.

సోమవారం సాయంత్రం కేజ్రీవాల్ నివాసంలో అధికారులతో సమావేశం జరిగింది. ఆధార్ కార్డులపై తలెత్తుతున్న సమస్యలు, ఇతర పథకాలపై చర్చజరిగింది. మాటామాటా పెరిగింది. కొన్ని ప్రశ్నలకు ప్రకాశ్ సరైన ఆధారాలు ఇవ్వలేందంటూ ప్రభుత్వ నేతలు గుస్సా అయ్యారు.  

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు అజయ్ దత్, ప్రకాశ్ జర్వాల్‌ తనపై చేయిచేసుకున్నారని ప్రకాశ్ తెలిపారు. వారిపై చర్య తీసుకోవాలని ఆయన  లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు మంగళవారం పొద్దున ఫిర్యాదు చేశారు. అయితే దాడి జరగనే లేదని, రభస మాత్రమే జరిగిందని కేజ్రీ సర్కారు వివరణ చ్చింది. తమ ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారిపై దాడి చేసేంత అనాగరికులు కారని పేర్కొంది.