నిర్భయ దోషికి స్లో పాయిజన్ ఇస్తున్నారు జడ్జీగారూ..   - MicTv.in - Telugu News
mictv telugu

నిర్భయ దోషికి స్లో పాయిజన్ ఇస్తున్నారు జడ్జీగారూ..  

January 25, 2020

Delhi

ఉరిని ఆలస్యం చేసేందుకు నిర్భయ దోషులు రోజుకో రకంగా పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా వినయ్ శర్మకు జైలు అధికారులు స్లో పాయిజన్ ఇచ్చారంటూ ఆయన తరుపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశాడు. ఆస్పత్రి రిపోర్టులు కూడా బయటకు రాకుండా చేస్తున్నారని పేర్కొన్నాడు. వెంటనే తమకు అతడి ఆరోగ్యానికి సంబంధించిన పత్రాలు ఇప్పించాలని కోరాడు. దీనిపై విచారణ చేపట్టిన పాటియాలా కోర్టు ఆ పిటిషన్ కొట్టివేసింది. 

వినయ్ శర్మకు స్లో పాయిజన్ ఇవ్వడం వల్ల అతని ఆరోగ్యం క్షీణిస్తోందని ఆరోపించారు. అతడు సరిగా భోజనం కూడా చేయడం లేదని పేర్కొన్నాడు. వెంటనే అతన్ని మరో జైలు గదిలోకి పంపించేలా ఆదేశాలివ్వాలని కోరాడు. అతడి ఆరోగ్యంపై జైలు పత్రాలు ఇప్పించాలని న్యాయవాది కోర్టును కోరారు. దోషులు ఉరి తప్పించుకునేందుకు తప్పుడు పిటిషన్లు వేస్తున్నారని.. వారికి సంబంధించిన అన్ని పత్రాలు ఇచ్చామని ప్రాసిక్యూషన్ అభిప్రాయపడింది. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి వినయ్ శర్మ లాయర్ వేసిన పిటిషన్ కొట్టివేశారు.దీంతో ఉరి నుంచి తప్పించుకునేందుకు మెల్లమెల్లగా దారులన్నీ మూసుకుపోతున్నాయి.ఇప్పటికే క్షమాభిక్ష అభ్యర్థన తిరస్కరించగా ఫిబ్రవరి 1న ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.