చందా కొచ్చర్ ‘అవినీతి’పై బయోపిక్.. కోర్టుకెక్కిన మాజీ సీఈవో - MicTv.in - Telugu News
mictv telugu

చందా కొచ్చర్ ‘అవినీతి’పై బయోపిక్.. కోర్టుకెక్కిన మాజీ సీఈవో

November 24, 2019

ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందా కొచ్చర్ పిటిషన్‌తో ఓ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఆమె జీవితం, ముఖ్యంగా అవినీతికి కారణమైనట్లు చెబుతున్న ఉదయంతం ఆధారంగా బాలీవుడ్‌లో ‘చందా ఏ సిగ్నేచర్‌ దట్ రూయిన్డ్ ఏ కెరీర్‌’ అనే పేరుతో సినిమాను తెరకెక్కించారు. దాంట్లో తనను అపరాధిగా చూపించే ప్రయత్నం చేశారని ఆమె ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం సినిమా విడుదలపై స్టే విధించింది. ప్రత్యేక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆమె పేరును వాడకూడదని ఆదేశించింది. సినిమాను కూడా ఆఫ్‌లైన్లో కానీ, ఆన్‌లైన్‌లో కానీ  విడుదల చేయకూడదని న్యాయస్థానం పేర్కొంది. 

Chanda Kochhar.

సినిమా యూనిట్ ఆమెను ఇప్పటి వరకూ సంప్రధించింది లేదని ఆమె తరుపు న్యాయవాది విజయ్ అగర్వాల్ కోర్టుకు వివరించారు. ఈ సినిమాలో చందా పాత్రలో నటించిన నటి గుర్లీన్ చోప్రా  చాలా సార్లు ఇంటర్వ్యూలలో ఆమె జీవితం ఆధారంగా సినిమా తీసినట్టు వెల్లడించారు. ఒక్క సంతకంతో చందాకొచ్చర్‌ కెరీర్‌ను ఎలా నాశనం చేసుకున్నారో ఈ సినిమాలో చూపించబోతున్నామని తెలిపారు. వీటిని బట్టి అవి ఆమె వ్యక్తిగత జీవితాన్ని కించపరచడమేనని లాయర్ న్యాస్థానం దృష్టికి తీసుకెళ్లారు.  

కాగా  జూన్ 2009 నుంచి అక్టోబర్ 2011 మధ్య  కాలంలో ఐసిఐసిఐ బ్యాంక్ సీఈవోగా ఉన్న సమయంలో వీడియోకాన్ గ్రూప్‌కు రుణాలు మంజూరు అయ్యాయి.  రూ .1,875 కోట్ల వరకు అర్హతకు మించి రుణాలు మంజూరు చేశారనే ఆరోపణలు వచ్చాయి. అవన్నీ వీడియోకాన్ సంస్థ ఎండీ ఆమె భర్త దీపక్ కొచ్చర్ సంస్థలో పెట్టుబడులు పెట్టిన తర్వాతే జరిగాయని ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు నిర్థారణకు వచ్చింది. దీని వల్ల ఆమెకు ఆర్థికంగా లాభం జరిగిందనే  కేసులో ఆమెపై ఈడీ,సీబీఐ విచారణ జరుపుతున్నాయి. విచారణ దశలో తన పేరు వాడుకొని సినిమా తీయడాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారు.