తీహార్ జైలు ఖైదీ వింత కోరిక..ఇంటి భోజనం,ఐపాడ్ కావాలట.! - MicTv.in - Telugu News
mictv telugu

తీహార్ జైలు ఖైదీ వింత కోరిక..ఇంటి భోజనం,ఐపాడ్ కావాలట.!

December 3, 2019

Delhi Gangster Appeal Home Food in Tihar Jail 

జైలుకు వెళ్లడం అంటే అదేదో వెకేషన్ ట్రిప్ వెళ్లినట్టుగా అనుకుంటున్నారు కొంత మంది నేరస్తులు. సకల భోగాలు కావాలంటూ రాచ మర్యాదలు కోరుకుంటున్నారు. సత్ప్రవర్తన కోసం శిక్ష అనుభవించాల్సింది పోయి గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. తాజాగా తీహార్ జైలులో ఉన్న ఓ గ్యాంగ్ స్టర్ తనకు జైలులో ఐపాడ్, రేడియో, ఇంటి భోజనం, మాంసాహారం కావాలంటూ అప్పీల్ చేయడం విని అంతా ఆశ్చర్యపోతున్నారు. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ ఇలా అత్తారింటికి వచ్చినట్టుగా కోర్కెల చిట్టా విప్పడమేంటని జైలు అధికారులు కూడా విస్తుపోతున్నారు. 

ఢిల్లీకి చెందిన నీతూ అలియాస్ నీరజ్ బవానా ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, ఇతని ఎన్నో కేసులు ఉన్నాయి. భు కబ్జాలు, బెదిరింపులు, హత్యలు, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం వంటి ఆరోపణల్లో 2015లో అరెస్టు అయ్యాడు. అప్పటి నుంచి అతన్ని తీహార్ జైలులో ఉంచారు. అతనిపై 40కి పైగా కేసులు ఉన్నాయి. అతని అనుచరులు కూడా నిందితులుగా ఉన్నారు. దీంతో అతన్ని ఓ ప్రత్యేక గదిలో ఒంటరిగా బందించారు. ఇది తట్టుకోలేకపోయిన నీరజ్ బవానా తనకు ఎఫ్ఎం రేడియో, ఐపాడ్ కావాలని కోర్టును కోరాడు. ఒంటరిగా ఉన్నందున కాలక్షేపం కోసం వీటిని అందించాలని విన్నవించాడు. ప్రతి రోజూ జైల్లో పెట్టే ఆహారాం రుచించడంలేదని, ఇంటి భోజనం కావాలని వినతి పత్రం ఇచ్చాడు. 

నీరజ్ బవానా డిమాండ్లు విన్న జైలు అధికారులు జైలు అందుకు నిరాకరించారు. జైలు నిబంధనల ప్రకారం రేడియోలో పాటలు వినేందుకు అవకాశం ఇచ్చారు. అయితే శాఖహార భోజనం మాత్రమే తాము అందిస్తామని స్పష్టం చేశారు. కాగా గతంలోనూ నీరజ్ ఇలాగే తన కోర్కెలు బయటపెట్టాడు. టీవీ ఏర్పాటు చేయాలంటూ కోర్టుకు విన్నవించాడు. అయినా అధికారులు మాత్రం అంగీకరించలేదు. అయితే జైల్లో ఖైదీలు ఇలా సకల సదుపాయాలకు డిమాండ్ చేయడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.