న్యూఢిల్లీలోని పెరల్ అకాడమీ ఫ్యాషన్ డిజైన్ లో 2021 గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది జయతి సరాఫ్. న్యూజిల్యాండ్ లోని వెల్లింగ్ టన్ లో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ ఆఫ్ వేరబుల్ ఆర్ట్ (వావ్) అవార్డ్స్ 2022లో రెండు అవార్డులను గెలుచుకుంది.
WOW అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యాధునిక డిజైనర్ విద్యార్థులు మొదటిసారి ప్రవేశించిన వారితో కలిసి ధరించగలిగే కళను సృష్టించే ఒక గౌరవనీయమైన వేదిక. అంతేకాకుండా.. ఒక క్రియేటివ్ 18 నెలలు కష్టపడ్డారు. కళాత్మక ప్రతిభతో జరిగే ఈ వేడుకకు దాదాపు 60వేల మంది హాజరయ్యారు.
దీపావళి అలంకరణలుగా సాధారణంగా ఉపయోగించే తేనెగూడు లాటిస్, కాగితపు నిర్మాణాల నుంచి ప్రేరణ పొందింది జయతి అవార్డు గెలుచుకున్న డిజైన్ ‘నియోరు’. ధీన్ని రూపొందించడానికి ఐరిడెసెంట్ ఫాయిల్ తో తయారుచేసిన బట్టను లేజర్ కట్ చేసింది. ఆమె ఆసియా డిజైన్ లకు అంతర్జాతీయ అవార్డును పొందమే కాకుండా, అన్ని అంతర్జాతీయ డిజైన్ లకు మొత్తం విజేతగా కూడా ప్రకటించబడింది. ఈ సంవత్సరం మొత్తం మూడు విభాగాలు పోటీ పడ్డాయి. 20దేశాలకు చెందిన 103మంది డిజైనర్ల ఎంట్రీలు వచ్చాయి. అందులో మొత్తంగా 88మంది డిజైనర్లు పాల్గొన్నారు.
విద్యాభ్యాసం..
ఢిల్లీలో పుట్టి పెరిగింది జయతి. కార్పొరేట్ వ్యాపార కుటుంబానికి చెందినది. ఆమె కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీలో 10వ తరగతి వరకు చదివింది. 11, 12 తరగతులు ముస్సూరీ ఇంటర్నేషన్ లో పూర్తి చేసింది. తనలో సృజనాత్మకత ఉందని గుర్తించింది ఆమె అంటుంది. ఫ్యాషన్ డిజైన్ ను అధ్యయనం చేయడం తనలో మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందంటుందీ అమ్మాయి. పెర్ల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. తర్వాత వెస్ట్రన్ వేర్ విభాగంలో మహిళల కోసం ఫ్యాషన్ బ్రాండ్ ‘మెలోవా’ని స్థాపించింది.
అవార్డు వెనుక..
ఈ అవార్డు ప్రక్రియ కోసం జయతి మూడు రౌండ్లను దాటింది. చివరి రౌండ్ లో నియోరు వస్త్రాన్ని ప్రదర్శించింది. ఈ డ్రెస్ కోసం తేనెగూడు నిర్మాణం నుంచి ప్రేరణ పొందింది. దీని కోసం 16, 17వ శతాబ్దంలో పురుషులు, మహిళలు ధరించే ముడతలు గల మస్లిన్ లేదా నారతో కూడా పెద్ద బట్టను ఉపయోగించాను. ఇక దీనికి నియోరు అని ఎందుకు పెట్టిందంటే.. ఇంగ్లీష్‌లో న్యూ, రఫ్ పదాల సమ్మేళనంగా ఈ నియోరు పుట్టిందని చెప్పింది జయతి. మొత్తానికి ఒకటి కాకుండా రెండు అవార్డులు రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉంది.
బ్రాండ్ గురించి..
‘పదేళ్లలో ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ప్రతీ మహిళా మా బ్రాండ్ నే మొదటి చాయిస్ గా ఎంచుకోవాలి. దీనికోసం నేను కృషి చేస్తూనే ఉంటా. అంతేకాదు.. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంట. దాంతో పాటు మన గత చరిత్ర తెలిసినప్పుడే ఈ ఫ్యాషన్ ప్రపంచంలో నెగ్గుకు రాగలం. అంతేకాదు.. ఈ ఈవెంట్ సందర్భంగా ఎంతోమంది డిజైనర్లను కలిశాను. వారి ప్రయాణం నాకు ఎంతో స్ఫూర్తిని అందించాయి’ అంటున్నది జయతి.