సెప్టిక్ ట్యాంకులను ఫ్రీగా క్లీన్ చేస్తాం.. సీఎం - MicTv.in - Telugu News
mictv telugu

సెప్టిక్ ట్యాంకులను ఫ్రీగా క్లీన్ చేస్తాం.. సీఎం

November 16, 2019

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ సర్కార్ ఇటీవల మహిళలకు మెట్రో రైళ్లల్లో, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఫ్రీ పథకాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక నుంచి ఢిల్లీ నగర వాసుల ఇళ్ళలో సెప్టిక్ ట్యాంక్ నిండితే ప్రభుత్వమే క్లీనింగ్ సర్వీసులను కల్పించనుంది. ఈమేరకు “ముఖ్యమంత్రి సెప్టిక్ ట్యాంక్ సఫాయి యోజన” పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించారు. 

aravind kejriwal.

ఢిల్లీ జల్ బోర్డ్ ఈ పథకం కోసం 80 ట్రక్కులను.. ప్రత్యేక సిబ్బందిని కూడా సిద్ధం చేస్తోంది. ఈ ట్రక్కులతో నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఉచిత సర్వీసులను అందించనున్నట్లు సమాచారం. ఈ క్లీనింగ్‌కు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించనుంది. ఢిల్లీలోని పలు అనధికార కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని.. త్వరలోనే అన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారని తెలుస్తోంది. ‘ఇప్పటి వరకు ప్రైవేట్ సర్వీసులు డ్రైనేజీని ఎక్కడ పడితే అక్కడే వదిలేయడంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. అందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చాం..’ అని సీఎం కేజ్రీవాల్ అన్నారు. అంతేకాకుండా ప్రైవేట్ సెప్టిక్ ట్యాంక్ సర్వీసు సిబ్బందికి సరైన శిక్షణ లేకపోవడంతో పాటుగా కావాల్సిన పరికరాలు లేకపోవడంతో వారు తీవ్ర అనారోగ్యాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.