Delhi High Court interim order On Aha prabhas episode
mictv telugu

ప్రభాస్ ఎపిసోడ్ పై.. హైకోర్టు సంచలన తీర్పు

December 30, 2022

Aha Court Case On Prabhas Episode

అర్హా మీడియా బ్రాడ్‌కాస్టింగ్ నిర్వహించే OTT ప్లాట్‌ ఫార్మ్ ‘ఆహా’లో టెలికాస్ట్ అవుతున్న సంచలన టాక్ షో ‘అన్‌స్టాపబుల్’కి కాపి బెడద పట్టుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ కావటంతో దేశవ్యాప్తంగా కనీవినీ ఎరుగని హైప్ ఏర్పడింది. ఇప్పటికే ఆహలో విడుదలైన ట్రైలర్ తో భారీ హైప్ రాగా.. డిసెంబర్ 30న రాత్రి 12గంటలకు ఎపిసోడ్ రిలీజ్ అయ్యి అత్యధిక వ్యూస్ తో దూసుకెళ్తుంది.
ఈ నేపథ్యంలో అన్‌స్టాపబుల్ ప్రభాస్ ఎపిసోడ్ వీడియోలు కాపీ చేసి సోషల్ మీడియాలో లీక్స్ చేస్తున్నారు. ఈ అక్రమ కాపీని సీరియస్ గా తీసుకున్న అర్హా మీడియా బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. ఈ సందర్భంగా కోర్టు నేడు ఉత్తర్వులు జారీచేసింది. అన్‌స్టాపబుల్ ని అక్రమంగా కాపీ చేయకుండా.. పలు వెబ్‌సైట్‌లను నిషేధిస్తూ ఢిల్లీ హైకోర్టు ‘జాన్ డో’ సంచలన జడ్జిమెంట్ ఇచ్చింది.

న్యాయమూర్తి సంజీవ్ సచ్‌దేవా యొక్క సింగిల్ జడ్జి బెంచ్ తీర్పునిస్తూ.. అన్‌స్టాపబుల్ ని చట్టవిరుద్ధంగా కాపీ చేస్త తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే ‘అన్ స్టాపబుల్’ మొదటి సీజన్ ను చట్టవిరుద్ధంగా ప్రసారం చేస్తున్న 265 వెబ్ సైట్ లు .. రెండవ సీజన్ ను స్ట్రీమింగ్ చేస్తున్న 64 వెబ్ సైట్ లపై ఆహా సంస్థ కోర్టుని ఆశ్రయించింది. ఇక ప్రభాస్ ఎపిసోడ్ కూడా పెద్ద ఎత్తున పైరసీకి గురవుతుందని అంచనా వేసి ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేసింది. దీనిపై విచారించిన కోర్టు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘిస్తే సదరు వెబ్ సైట్లకు తీవ్ర పరిణామాలు తప్పవని.. అవసరమైతే జైలుకి కూడా పంపుతామని కోర్టు హెచ్చరించింది. ఉత్తరాదిన ప్రభాస్ కి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా అక్కడ పలు వెబ్ సైట్ లు డార్లింగ్ ఇంటర్వ్యూలను పైరేట్ చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయన్న సమాచారంతో ఆహ ముందుజాగ్రత్తగా ఢిల్లీకోర్టులో కేసు వేశారని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

రెడ్లా.. రాజులా.. శెట్టిలా.. ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ?

22ఏళ్ళ తరువాత మరో సంచలనం.. మెగా మాస్ సాంగ్ పూనకాలు రిలీజ్..!

రాహుల్ సిప్లిగంజ్ దావత్ పాట