ఢిల్లీ ఆశ్రమంలో బందీగా నిజామాబాద్ యువతి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీ ఆశ్రమంలో బందీగా నిజామాబాద్ యువతి..

February 28, 2020

Delhi High Court

కూతురు కోసం నిజామాబాద్ వాసులు మీనవతి, రాంరెడ్డి దంపతులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీలోని ‘నిధిగుప్త’ ఆధ్యాత్మిక ఆశ్రమంలో తమ కూతురు సంతోష్ రూపని బంధించారని.. ఆ ఆశ్రమం అసాంఘీక కార్యకలాపాలకు అడ్డా అని పిటిషన్ దాఖలు చేశారు. తమ కూతురు తరహాలోనే 168 మంది అమ్మాయిలను ఆశ్రమంలో ఉంచారని పేర్కొన్నారు. ఆశ్రమ వ్యవస్థాపకుడు వీరేంద్ర దీక్షిత్‌పై అత్యాచారం సహా పలు కేసులు నమోదు అయ్యాయని.. సీబీఐకి దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నారని పిటిషన్‌లో తెలిపారు. ఆశ్రమ నిర్వాహకులు యువతులకు డ్రగ్స్‌కు బానిసలుగా మార్చి వ్యభిచారం చేయిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

అమెరికాలో నానో టెక్నాలజీలో పీహెచ్‌డీ చేసిన తమ కుమార్తె పై డ్రగ్స్ ప్రయోగించి ఉంటారు అని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు చెప్పకుండానే ఆశ్రమంలో చేరిందని వారు అంటున్నారు. కేసు విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీచేసింది. పిటిషన్‌పై రెండు వారాల్లో స్పందించాలని ఆదేశిస్తూ.. కోర్టు కేసు విచారణను ఏప్రిల్ 13కు వాయిదా వేశారు. కాగా, 2017లో ఆ ఆశ్రమంపై పోలీసులు దాడులు చేశారు.