Home > Featured > 'గూగుల్‌ పే'కు కోర్టు నోటీసులు…

'గూగుల్‌ పే'కు కోర్టు నోటీసులు…

Google Pay

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ తీసుకుని వచ్చిన డిజిటల్ పేమెంట్స్ ఆప్ గూగుల్ పేపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిజిటల్ చెల్లింపుల్లో సరైన మార్గదర్శకాలు పాటించడం లేదంటూ గూగుల్ పే పై ఢిల్లీ హైకోర్టులో శుభమ్ కపాలే అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తాజాగా విచారణ ప్రారంభమైంది. గూగుల్‌ పే యాప్ యూపీఐ సేవలను నిలిపివేయాలని కోరుతూ పిటిషనర్ కోరారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ మార్గదర్శకాలను గూగుల్ పే సంస్థ పాటించడం లేదని పిటిషన్ లో పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే హైకోర్టు గూగుల్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. గూగుల్‌ ఇండియా డిజిటల్‌ సర్వీసెస్‌ వెంటనే అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీనిపై గూగుల్ పే స్పందించాల్సి ఉంది.

Updated : 15 May 2020 10:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top