అతని కోసం సెక్స్ మార్చిడి చేయించుకుంటే గొంతు కోసి పోయాడు..  - MicTv.in - Telugu News
mictv telugu

అతని కోసం సెక్స్ మార్చిడి చేయించుకుంటే గొంతు కోసి పోయాడు.. 

July 16, 2020

Delhi Husband incident In Suspicion Of Illicit Relation Victim Send Her Video To Fathe

‘మాతో ఏ మగాడు శాశ్వతంగా తన జీవితాన్ని పంచుకోలేడు. మాలాంటివాళ్లను కోడలిగా అంగీకరించేంత ఔదార్యం అతని కన్నవాళ్లకు కూడా ఉండదు. కొంతకాలం రంగుల ప్రపంచం చూపించి.. తన అవసరం తీరగానే మాయమవుతాడు’ ఈ మాటలను ఎంతోమంది ట్రాన్స్‌జెండర్లు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఇది మళ్లీ ఓ ట్రాన్స్‌జెండర్ జీవితంలో నిజమైంది. ప్రియుడు తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాడని భ్రమించింది ఆమె. ప్రియుడి కోసం తాను పూర్తి స్త్రీగా మారాలని లింగమార్పిడి ఆపరేషన్ కూడా చేయించుకుంది. అంతా అయ్యాక వాడు ఆమె గొంతు కోసి పరారయ్యాడు. దీంతో ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ళ క్రితం ఒక యువకుడు తనలో స్త్రీ లక్షణాలు ఉన్నాయని లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని యువతిగా మారాడు. ఆ ఆపరేషన్ అయ్యాక ఏడాదికి ఆ యువతిని ఉత్తర ప్రదేశ్ మహోబా జిల్లాకు చెందిన జ్ఞానేంద్ర శుక్లా అనే యువకుడు పరిచయం అయ్యాడు. ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు.. నిన్ను నేను ప్రేమిస్తున్నాను.. నువ్వు లేకుండా ఉండలేను’ అని ఆమెను నమ్మబలికాడు. దీంతో ఆమె అతని మాయ మాటలను నమ్మి ప్రేమించింది. అలా వారిద్దరూ ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంత ఘాటు ప్రేమలో మునిగి పోయారు.

కొంతకాలానికి పెళ్లి చేసుకోవాలనుకుని 2019, మార్చి 13న పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్ళికి యువకుడి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో వారిద్దరూ కలిసి యువతి ఇంట్లోనే కాపురం పెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో రానురాను కళతలు మొదలయ్యాయి. పార్టీల పేరుతో బయటకి వెళ్తోందని భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. బయటకు వెళ్లడానికి వీల్లేదని ఆంక్షల విధించాడు. ఆమెపై అనుమానాన్ని తీవ్ర స్థాయిలో పెంచుకున్న అతను భార్య సెల్‌ఫోన్‌ను చెక్ చేసేవాడు. ఆమెకు వచ్చిన మెసేజ్‌లు చదివేవాడు. ఈవిషయమై ఇంట్లో తరచూ గొడవపడే వారు. ఈ గొడవ భరించలేని ఆమె తల్లితండ్రులు వారిని వేరు కాపురం పెట్టమని సూచించారు. దీంతో వారిద్దరూ అక్కడి నుంచి లజపత్ నగర్ ఫేజ్ 4లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అక్కడా శుక్లా తీరు మారకపోవడంతో వారిద్దరు విడిపోయారు. శుక్లా కోట్ల ముబారక్‌పూర్‌లో, భార్య దక్షిణ ఢిల్లీలోని అమర్ కాలనీలోని వేరువేరుగా నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం జులై 11న భార్య వద్దకు శుక్లా వచ్చి గొడవ పెట్టుకున్నాడు. ఆవేశంలో అతను భార్య గొంతుకోసి పరారయ్యాడు. తీవ్ర గాయాలతోనే తండ్రికి వీడియో కాల్ చేసి చెప్పింది ఆమె. చుట్టు పక్కల వారి సహాయం కోసం సుత్తితో తలుపు కొట్ట సాగింది. ఇంతలో పక్కింటివారు గమనించి వచ్చి ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి వాంగ్మూలం తీసుకుని నిందితుడు శుక్లాను అదరుపులోకి తీసుకున్నారు.