రూ. 399కే కోవిడ్ టెస్ట్ కిట్.. మూడు గంటల్లోనే ఫలితం - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 399కే కోవిడ్ టెస్ట్ కిట్.. మూడు గంటల్లోనే ఫలితం

July 16, 2020

Delhi IIt Launches Corona Kit

కరోనా పరీక్షల విషయంలో భారత్ మరింత ముందడుగు వేసింది. మరింత వేగవంతగా చేయడంతో పాటు తక్కువ ఖర్చుతోనే పూర్తి చేసే టెస్ట్ కిట్ రూపొందించారు. ఢిల్లీ ఐఐటీకి చెందిన పరిశోధన విద్యార్థులు దీన్ని అభివృద్ధి చేశారు. కేవలం రూ. 399కే దీన్ని మార్కెట్లో విక్రయించనున్నట్టు చెప్పారు. ఈ కిట్‌తో అతి తక్కువ ధరకే టెస్టులు చేసుకునే అవకాశం కలుగుతుందని విద్యార్థులు వెల్లడించారు. అయితే శాంపిల్ కలెక్షన్ వంటి ఇతర ఖర్చులు కలుపుకొని టెస్టు కోసం రూ. 700లోపు వెచ్చించాల్సి ఉంటుందని తెలిపారు. 

కోరోష్యూర్ పేరుతో 9 మంది రీసెర్చ్ స్కాలర్స్ దీన్ని రూపొందించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ దీన్ని మార్కెట్లోకి విడుదల చేశారు. దీనికి ఇప్పటికే ఐసీఎంఆర్ కూడా ఆమోదం తెలిపింది. మూడు గంటల్లోనే ఇది ఫలితాలను ఇవ్వనుంది. పూర్తి దేశీయ పరిజ్ఞానముతో రూపొందించామని చెప్పారు.    న్యూటెక్ మెడికల్ డివైజెస్ సంస్థతో  మార్కెట్లోకి తీసుకువచ్చారు. దీంతో ఇక నుంచి కోవిడ్ టెస్టులు చేయించుకునే వారికి ధరల భారం తగ్గే అవకాశం ఉందని  చెబుతున్నారు.