Home > Featured > స్త్రీలు మగతోడు లేకుండా రావొద్దు.. జామా మసీదు

స్త్రీలు మగతోడు లేకుండా రావొద్దు.. జామా మసీదు

పురుషుడి తోడు లేకుండా మహిళలు తమ మసీదు ప్రాంగణంలోకి అడుగుపెట్టొద్దని ఢిల్లీలోని ప్రఖ్యాత జమా మసీదు నిషేధం విధించింది. స్త్రీలు తమ కుటుంబంలోని పురుషులను వెంటబెట్టుకుని రావాలని ప్రవేశ ద్వారాల వద్ద నోటీసులు అతికించింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ మసీదు పాలన కమిటీకి నోటీసు జారీ చేశారు. ఇలాంటి నిషేధం విధించే హక్కు ఎవరికీ లేదని ఆమె ఆక్షేపించారు. ‘‘నిషేధం చాలా తప్పు. ప్రార్థించే హక్కు స్త్రీలకు కూడా ఉంటుంది’ అని అన్నారు. అయితే నిషేధాన్ని పాలక కమిటీ గట్టిగా సమర్థించుకుంటోంది.

‘‘ఇది ప్రార్థనా స్థలం. కానీ కొంతమంది యువతులు, మహిళలు కేవలం డేటింగ్ కోసం వస్తున్నారు. అది అలాంటి వ్యవహారాలకు చోటు కాదు. అందుకే నిషేధం పెడుతున్నాం’ అని షాహీ ఇమామ్ సయ్యద్ బుఖారీ అన్నారు. ప్రార్థనల కోసం వచ్చినవారికి ఇబ్బంది కలిగించేలా కొందరు సోషల్ మీడియా కోసం వీడియోలు షూట్ చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మసీద్ పీఆర్‌వో సబివుల్లా ఖాన్ అన్నారు. 17వ శతాబ్దిలో నిర్మితమైన జామా మసీదుకు భక్తులతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. నిషేధం వల్ల ఒంటరి మహిళలకు, పురుషులు లేకుండా వచ్చే స్త్రీలకు ఇబ్బంది కలుగుతుందని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Updated : 24 Nov 2022 6:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top