ఢిల్లీ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న అనిల్ బైజాల్ తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు రాజీనమా లేఖలో పేర్కొన్నారు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ పార్టీ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్‌తో విభేదాలే రాజీనామాకు కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు కారణం ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.