ఢిల్లీ మద్యం కుంభకోణంలో పెద్ద తలకాయలు బయటపడుతున్నాయి. కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన రెండో చార్జిషీటులోకి ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కూడా ఎక్కింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేరును కూడా ఈడీ ఇందులో ప్రస్తావించింది. అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రా, విజయ్ నాయర్, బినోయ్ బాబు సహా మొత్తం17 మందికి ఈ కుంభకోణంలో భాగమున్నట్లు ఆరోపించింది.
అభియోగాలు..
ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ల ఇన్ చార్జి విజయ్ నాయర్.. కీలక నిందితుడైన సమీర్ మహేంద్రుకు, సీఎం కేజ్రీవాల్‌కు మధ్య ‘ఫేస్ టైమ్’ వీడియో లింకులో ముఖాముఖి జరిపినట్లు వెల్లడించింది. ‘‘విజయ్ మనోడే. మీరు అతన్ని నమ్మి ముందుకెళ్లొచ్చు’’ అని సీఎం చెప్పినట్లు తెలిపింది.జ ‘‘దేశ రాజధానిలో లిక్కర్ లైసెన్సులు పొందిన సదరన్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేతల తరఫున విజయ్ నాయర్ వంద కోట్లు ముడుపులు తీసుకున్నాడు. ఈ సొమ్మును గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేశారు. సర్వే టీమ్ లకు రూ. 70 లక్షల నగదు చెల్లించారు. సదరన్ గ్రూపులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి, శరత్ రెడ్డి (అరబిందో ఫార్మా) ఉన్నారు’’ అని ఈడీ వివరించింది.