ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం ఐదుగురు నిందితులు వేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. శరత్ చంద్రారెడ్డి, బోయినపల్లి అభిషేక్, బినోయ్ బాబు, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రుల బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరు వాదనలు విన్న తర్వాత బెయిల్ నిరాకరించింది.ఐదుగురు నిందితులపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి అని కోర్టు పేర్కొంది. నిందితులు మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 3 కింది ఆర్థిక నేరాలు పాల్పడడంతో బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది.
లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వ్యాపారవేత్త సమీర్ మహేంద్రు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్ నాయర్ ఇళ్లను అటాచ్ చేసింది. అలాగే దినేష్ అరోరా రెస్టారెంట్‌ను, అమిత్ అరోరా ఆస్తులను కూడా అటాచ్ చేసింది. సమీర్ మహేంద్రుకు చెందిన రూ.35 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. అలాగే అమిత్‌అరోరాకు చెందిన రూ.7.68 కోట్లు, విజయ్‌నాయర్‌కు చెందిన రూ.1.77 కోట్లు, దినేష్ అరోరాకు చెందిన రూ.3.18 కోట్లు, అరుణ్ పిళ్లైకి చెందిన రూ.2.25 కోట్లు, ఇండో స్పిరిట్‌కు చెందిన రూ.14.39 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో రూ.2,873 కోట్ల స్కామ్ జరిగిందని, ఇప్పటి వరకు రూ. 76.54 కోట్ల నగదును పట్టుకున్నామని ఈడీ అధికారులు వెల్లడించారు.