ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు కొనసాగుతోంది. తాజాగా మరొకరు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామిక వేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రెండో రోజులు పాటు పిళ్ళైను విచారించిన ఈడీ అధికారులు..కేసుతో సంబంధం ఉందని తేలడంతో అరెస్ట్ చేశారు. మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటి వరకు 11 మంది అరెస్ట్ అయ్యారు. గతంలో పిళ్లై ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి కోట్లాది రూపాయలను కూడా జప్తు చేశారు.
మనీశ్ సిసోడియాను కూడా ఈడీ నేడు ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రస్తుతం సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు. వారం రోజుల సీబీఐ కస్టడీ ఆనంతరం కోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్డడీ కోసం జైలుకు తరలించారు. సిసోడియా తనతో పాటు జైలుకు మందులు, కళ్లద్దాలు, డైరీ, పెన్ను, భగవద్గీతను తీసుకెళ్లడానికి జడ్జి అనుమతి ఇచ్చారు. ఈడీ కేసులో అరెస్టైన మరో ఆప్ నేత సత్యేంద్ర జైన్‌తో పాటు లిక్కర్ స్కాంలో అరెస్టైన ఏడుగురు నిందితులు కూడా ప్రస్తుతం తీహార్ జైలులోనే ఉన్నారు.