ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఈడీ విచారణకు బయలుదేరారు. ఢీల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో కవిత దర్యాప్తుకు మరికాసేపట్లో హాజరుకానున్నారు. కవిత వెంట ఆమె భర్త అనీల్, అడ్వకేట్లు ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు అభివాదం చేసిన కవిత ర్యాలీగా ఈడీ కార్యాలయానికి రావాలనుకున్నారు. అయితే పోలీసులు ర్యాలీకి అనుమతించ లేదు. దీంతో ఢిల్లీలోని కేసీఆర్ ఇంటి ముందు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి ర్యాలీలను పోలీసులు అనుమతించడం లేదని మైక్ లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు . ర్యాలీని అడ్డుకునేందుకు బ్యారీకేడ్లు ఏర్పాటు చేశారు. పలువురు పార్టీ ముఖ్య నేతలు ఇప్పటికే కవితను కలుసుకున్నారు. కవితకు మద్దతుగా ఇప్పటికే ఈడీ కార్యాలయానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్యలు, నేతలు చేరుకున్నారు. ఈడీ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ ను విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.