ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా లిక్కర్ కేసులో అరెస్టైన హైదరాబాద్ పారిశ్రామిక వేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ చేర్చడం చర్చనీయాంశమైంది. కవిత బినామి పిళ్లై అని ఈడీ పేర్కొంది. ఆమె చెప్పిన పనులన్నీ రామచంద్రపిళ్లై చక్కదిద్దారని ఈడీ ఆరోపిస్తోంది. అదే విధంగా ఇండో స్పిరిట్ స్థాపనలో పిళ్లై కీలకపాత్ర పోషించాడని.. అలాగే కాగితాలపై 3.5 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు చూపారని తెలిపింది. అందుకు ప్రతిఫలంగా కవిత ఆదేశాలతో అరుణ్‌పిళ్ళైకు కోటి రూపాయలు ఇచ్చినట్లు రిపోర్టులో వెల్లడించింది.
అరుణ్ రామచంద్ర పిళ్లైను ఈడీ అధికారులు నేడు అదుపులోకి తీసుకున్నారు. రెండో రోజులు పాటు పిళ్ళైను విచారించిన ఈడీ అధికారులు..కేసుతో సంబంధం ఉందని తేలడంతో అరెస్ట్ చేశారు. మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటి వరకు 11 మంది అరెస్ట్ అయ్యారు. గతంలో పిళ్లై ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి కోట్లాది రూపాయలను కూడా జప్తు చేశారు.
త్వరలో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు అనుగుణంగా..లిక్కర్ కేసులో ఆమె పేరునను ఈడీ పదేపదే సార్లు ప్రస్తావించడం ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే అతడు తాజాగా బెయిల్‌పై బయటకు వచ్చారు.