Delhi Liquor Scam:Kavitha Name Appearts In Amit Aroras Remand Report
mictv telugu

కవిత ముందున్న ఆప్షన్లు ఏంటి?

December 1, 2022

తెలంగాణలో ఈడీవేడి రాజుకుంది.ఢిల్లీ లిక్కర్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కవిత పేరు ఉండటం కలకలం రేపుతోంది. బీజేపీ ఎత్తుగడల్లో భాగంగా ఇది జరిగిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తున్నారు. ఎన్నికలు జరగబోయే రాష్ట్రంలో మోదీ కంటే ముందు ఈడీ రావడం సహజమన్నారు.పెడితే కేసులు పెట్టుకోండి..ఏమైతది జైలుకు వెళ్తాం…అని కవిత అన్నారు. పొలిటికల్‌గా ఎటాక్ చేసిన కవిత..రిమాండ్ రిపోర్ట్‌లో ఆరోపణలపై స్పందించలేదు. ఈ ఆరోపణలపై అంతర్గతంగా టీఆర్ఎస్ ముఖ్యులతో చర్చించినట్టు తెలుస్తోంది.ఈ రిమాండ్ రిపోర్ట్‌తో ఏం జరుగుతోంది. ఈడీ దూకుడు పెంచుతుందా?ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారా? ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటిదాకా ఏం జరిగింది?ముందు ముందు ఏం జరగబోతోంది?

లిక్కర్ లింకులు
ఢిల్లీ లిక్కర్ కేసులో తెలుగువాళ్ల పేర్లు ప్రకంపం రేపుతోంది. మొత్తం 36 మంది ఈ కేసులో ఉన్నారు. ఇందులో 8 మంది తెలుగువాళ్లు ఉన్నారు. బోయిన్ పల్లి అభిషేక్ రావు, శరత్ చంద్రారెడ్డి, రామచంద్ర పిళ్లై, సృజన్ రెడ్డి,గండ్రా ప్రేమ్ సాగర్ రావుల్ని ఈడీ ప్రశ్నించింది. ఇప్పుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో ఎమ్మెల్సీ కవిత, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లు బయటకొచ్చాయి. వీరిలో ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ రావులు అరెస్ట్ అయ్యారు. వీళ్లనే సౌత్ గ్రూప్‌గా ఈడీ ప్రస్తావిస్తోంది.

కవిత క్లారిఫికేషన్
” మోదీ అధికారంలోకి వచ్చి 8ఏళ్లు అవుతుంది. 9రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని బీజేపీ పడగొట్టింది. ఎన్నికలు వచ్చే రాష్ట్రాల్లో మోదీ కన్న ముందు ఈడీ రావడం సహజం.తెలంగాణలో డిసెంబర్‌లో ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడకు మోదీకి ముందే ఈడీ వచ్చింది. బీజేపీ నీచమైన పనికి పూనుకుంది. మీడియాకు లీకులు ఇచ్చి మా పేరు చెడగొడుతున్నారు. కేసులు పెడతారా..పెట్టుకోండి..ఏమైతది జైలుకు వెళ్తాం. ధైర్యంగా కేసులు ఎదుర్కొంటాం”అని కవిత అన్నారు.

రిమాండ్ రిపోర్ట్‌లో…

అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టలో కవిత పేరును ఈడీ అధికారులు ప్రస్తావించారు. 32 పేజీల రిమాండ్ రిపోర్ట్లో కవిత పేరు మూడుసార్లు ప్రస్తావనకు వచ్చింది. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం రూ.100 కోట్లు ముడుపులను సౌత్ గ్రూప్ చెల్లించింది. ఈ సౌత్ గ్రూప్ ని కవిత, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి , వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కంట్రోల్ చేశారు. సౌత్ గ్రూప్ ద్వారా రూ.100కోట్లను విజయ్ నాయర్‌కు చేర్చారు. విచారణలో భాగంగా ఇచ్చిన వాంగ్మూలంలో అమిత్ అరోరా చెప్పారు. ఈ ఎపిసోడ్‌లో కవిత ఉపయోగించిన 10 సెల్ ఫోర్లును ధ్వంసం చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో ఉంది. సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు గుర్తించామని ఈడీ పేర్కొంది. ఈ కేసులో 36 మంది రూ.1.38 కోట్ల విలువైన 170 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని తెలిపింది. 2021 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు కవిత 10 ఫోన్లు మార్చారని , ఆ 10 ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లను రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. 2021 సెప్టెంబర్ 1న ఒకేరోజు ఎమ్మెల్సీ కవిత, బోయినపల్లి అభిషేక్ రావు, సీఏ బుచ్చిబాబు ఫోన్లు మార్చారని అందులో ఉంది.

లిక్కర్ కేసు అసలు గుట్టు…

ఢిల్లీలోని 32 జోన్లలో జోన్ల వారీగా లిక్కర్ లైసెన్సులు పొందిన వాళ్లలో సమీర్ మహేందు, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, అమిత్ అరోరాకు చెందిన కంపెనీలు ఉన్నాయి. మరికొన్ని కంపెనీల వెనుక ఎవరున్నరన్నది విచారణ జరుగుతోంది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ తయారీలో కీలకంగా ఉన్న మంత్రుల బృందంలో మనీశ్ సిసోడియా, సత్యేంద్రజైన్ , కైలాష్ గెహ్లాట్ ఉన్నారు. నిపుణుల కమిటీ రిపోర్ట్ ,పబ్లిక్ సూచనలకు విరుద్ధంగా ఢిల్లీ మంత్రుల బృందం లిక్కర్ పాలసీని తయారు చేసింది. పాలసీ పైనల్ అయిన 3 నెలల తర్వాత ఆలస్యంగా పబ్లిక్ డొమైన్‌లో పెట్టారు. హోల్‌సేల్ వ్యాపారాన్ని తయారీ నుంచి వేరు చేసి, పూర్తిగా ప్రైవేటుకే ఇచ్చేలా లిక్కర్ పాలసీని మార్చారు.

5 నుంచి 12 శాతానికి పెంచారు…

లిక్కర్ విక్రయాల ద్వారా హోల్ సేల్ మద్యం సంస్థలకు వచ్చే లాభం పాలసీలో 5 శాతమే ఉంది. దీన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం ఏకంగా 12శాతానికి పెంచింది. ఇంత భారీగా పెంచడానికి అర్థంలేని కారణాలను చూపించారు. మరోవైపు నిపుణుల కమిటీ రిపోర్ట్‌ని అమలు చేయలేదు. కొన్ని నిర్ధారించిన ప్రాంతాల్లో షాపులు తీయలేమన్న పేరుతో లైసెన్స్ పొందిన వారి ఫీజుల్ని భారీగా తగ్గించారు. కానీ గత మూడేళ్ల ఈ పాలసీ కాలంలో సేల్స్ భారీగా పెరిగాయి. కొన్ని షాపులు తీయకపోవడం వల్ల వారికి ఎలాంటి నష్టం రాలేదు. కానీ లైసెన్స్ ఫీజు తగ్గించడం వల్ల వ్యాపారులకు రూ.719 కోట్లు అనసరలాభం కలిగించారు. ఈ మేరకు ఢిల్లీ ఖజానాకు నష్టం జరిగింది. లైసెన్స్ ఫీజులను తగ్గించడం, పలు ఇతర మినహాయింపులతో రూ.2,873 కోట్ల నష్టం వాటిల్లింది. మొత్తంగా ఢిల్లీ లిక్కర్ కేసులో సౌత్‌లో ప్రకంపం రేపుతోంది.