ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎంసీడీ ఎన్నికల్లో 134 స్థానాలతో గెలిచిన ఆమ్ ఆద్మీపార్టీ.. ఢిల్లీ పీఠాన్ని అధిష్టించబోయే సమయంలో… మేయర్ పదవికి బీజేపీ పోటీ పడటం ఆసక్తిగా మారింది. మేయర్ పీఠాన్ని తామే దక్కించుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. 250 స్థానాలు ఉన్న ఎంసీడీలో 134 ఆప్, 104 స్థానాల్లో బీజేపీ , 9చోట్ల కాంగ్రెస్ గెలుపొందాయి. ఓటమి కారణంగా మేయర్ పదవికి పోటీ చేయబోమని బీజేపీ ప్రకటించినా తాజాగా బరిలో నిలవడంతో ఎంసీడీ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
BJP and AAP councillors clash with each other and raise slogans against each other ahead of Delhi mayor polls at Civic Centre. #MCDMayorElection pic.twitter.com/3pB9r7uQF8
— TOI Delhi (@TOIDelhi) January 6, 2023
మేయర్ ఎన్నికకు ముందర రసాభాస చోటు చేసుకుంది. నామినేటెడ్ కౌన్సిలర్లు ప్రమాణం చేసే సమయంలో సివిక్ సెంటర్ వద్ద ఆప్, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో సంయమనం పాటించాలని ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ(బీజేపీ) తోటి సభ్యులకు పిలుపు ఇచ్చారు. అయినా కూడా ఏమాత్రం తగ్గలేదు. ఈ ఎన్నికకు ఆప్ తరపున షెల్లీ ఒబెరాయ్ పోటీపడుతుండగా, బీజేపీ నుంచి రేఖా గుప్తా బరిలో నిలిచారు. డిప్యూటీ మేయర్ పోస్ట్ కోసం ఆప్ నుంచి ఆలె ముహమ్మద్ ఇక్బాల్, జలాజ్ కుమార్లు, బీజేపీ నుంచి కమల్ బార్గీలు పోటీ పడుతున్నారు.