Delhi-Mehrauli Murder Case LIVE Updates
mictv telugu

అమెరికా క్రైమ్ షో చూసి..ప్రియురాలిని 35 ముక్కలుగా కోసి…

November 15, 2022

అమెరికా క్రైమ్ షో చూసి క్రూరుడిగా మారాడు. ఆ క్రైమ్ ఎపిసోడ్‌లు చూసి కిరాతకం చేశాడు. సస్పెన్స్ థ్రిల్లర్‌తో సైకో కిల్లర్‌గా మారాడు. నమ్మి ఇంట్లో నుంచి వచ్చిన ప్రియురాలిని 35 ముక్కలుగా చేశాడు. మృతదేహాన్ని ఆర్నెళ్లుగా ఫ్రీజ్‌లో పెట్టి రోజుకోచోట ఆ ముక్కల్ని పడేశాడు. ఇంతా క్రూరంగా ప్రియురాలిని హత్య చేయడానికి ఓ క్రైమ్ షో కారణం. ఆ షో చూసే ఇదంతా చేశానని ఢిల్లీ దారుణ ఘటన నిందితుడు పోలీసులకు చెప్పాడు.

క్రైమ్ షో చూసి…

ఢిల్లీ దారుణ ఘటనలో సంచలనాలు బయటపడుతున్నాయి. పోలీసుల విచారణలో నివ్వెరపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. నిందితుడు చెబుతున్న విషయాలు పోలీసులకే షాక్ ఇస్తున్నాయి. సీన్ టు సీన్ అతను చెబుతున్న తీరు అవాక్కయ్యేలా చేస్తోంది. అమెరికన్ క్రైమ్ షో దిక్స్టార్ చూసి దారుణానికి ఒడిగట్టాడు నిందితుడు. అచ్చం ఆ షో లో ఉన్నట్టే ప్రియురాలిని చంపేశాడు. మృతదేహాన్ని ఫ్రీజ్‌లో దాచిపెట్టి జాగ్రత్తలు పాటించాడు.వాసన రాకుండా షోలో చేసినట్టే చేశాడు.

పెళ్లి ప్రస్తావనే….

శ్రద్దా వాల్కర్ (26) ముంబైలో కాల్ సెంటర్‌లో పనిచేసేది. 28 ఏళ్ల ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాతో పరిచయమైంది. డేటింగ్ యాప్ లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత సహజీవనానికి దారితీసింది. వీరి రిలేషన్ షిప్ ని ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదు. ముంబై నుంచి పారిపోయి ఢిల్లీలోని మెహ్రౌలిలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన వివాదం రేపింది. పెళ్లి చేసుకోవాలని శ్రద్ద..ఆఫ్తాబ్ పై ఒత్తిడి పెంచింది.

చంపేశాక…

పెళ్లి విషయంలో మే 18న గొడవ ముదిరింది. ఆవేశంలో అమీన్ శ్రద్దా వాల్కర్ ని చంపేశాడు. ప్రియురాల మృతదేహాన్ని 35 ముక్కులుగా కోసి ఫ్రీజ్‌లో పెట్టాడు. మృతదేహంకోసం 3వందల లీటర్లు ఫ్రీజ్ కొన్నాడు.బయటకు వాసనరాకుండా అగర్‌బత్తీలు వెలిగిస్తూ రూమ్ ఫ్రెషనర్లు వాడేవాడు. 18రోజులపాటు ఢిల్లీ శివారు ప్రాంతాల్లో అర్ధరాత్రిదాటాక ముక్కల్ని పడేశాడు. రోజుకోచోట పడేసి పోలీసులకు దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు. అలా చెట్లపొదల్లో పడేస్తూ యువతి మృతదేహాన్ని జాడలేకుండా చేశాడు.

స్నేహితుల మాట

“శ్రద్ధ-ఆఫ్తాబ్ ల బంధం 2018 నుంచి కొనసాగుతుంది.ఇద్దరూ సంతోషంగా ఉండేవాళ్లు. కొన్నాళ్ల తర్వాత ఆఫ్తాబ్ కొడుతున్నాడని శ్రద్ధ చెప్పింది. అయినా ఆఫ్తాబ్‌తోనే కలిసి ఉంటానని ఢిల్లీ వెళ్లింది”అని రాజత్ శుక్లా చెబుతున్నాడు. “జులై నుంచి శ్రద్ధ నుంచి రిప్లే లేదు. ఆమె ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. మిగతా స్నేహితుల్ని వాకబు చేసినా వారు తెలియదన్నారు. ఆతర్వాత శ్రద్ద బ్రదర్‌తో కలిసి పోలీసులకు కంప్లయింట్ చేశాం” లక్ష్మణ్ నదిర్ అంటున్నాడు.

ఇలా తెలిసింది…

నవంబర్ 8న శ్రద్ద తండ్రి ఢిల్లీలోని ఫ్లాట్‌కు వచ్చి చూడగా తాళం వేసి వేసింది. వెంటనే స్టేసన్ కెళ్లిన ఆయన..తనకూతురు కనిపించడం లేదని కంప్లయింట్ చేశాడు. ఆఫ్తాబ్‌ని అరెస్ట్ చేసి ప్రశ్నించడంతో దారుణం వెలుగుచూసింది. ఆఫ్తాబ్ ఫ్రెండ్స్ ని పోలీసులు విచారించారు. అతని సోషల్ మీడియా అకౌంట్ ని పరిశీలించారు.శ్రద్ద కంటే ముందు ఎవరితోనైనా ఇలా చేశాడా అనే దానిపై ఆరాతీశారు. క్రైమ్ స్పాట్ ని పరిశీలించిన పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆధారాల్ని సేకరించిన ఢిల్లీ పోలీసులు..వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.