20 మంది మెట్రో రైలు ఉద్యోగులకు కరోనా - MicTv.in - Telugu News
mictv telugu

20 మంది మెట్రో రైలు ఉద్యోగులకు కరోనా

June 5, 2020

Delhi Metro Employees Test Corona Positive

దేశరాజధాని ఢిల్లీలో 20 మంది మెట్రో రైలు కార్పొరేషన్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు కరోనా వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. తమ సంస్థలో పని చేసే వివిధ స్థాయి ఉద్యోగులకు వైరస్ సోకినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. వీరంతా ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్టుగా వెల్లడించారు. వారిని ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించారు. సిబ్బందిలో కొంత మందికి వైరస్‌ సోకినా మెట్రో సేవలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అధికారులు వెల్లడించారు. 

దీంట్లో భాగంగా మెట్రోరైలు అధికారులు మాస్క్, గ్లోవ్స్ ధరించిన బాలిక పోస్టరును అధికారులు ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాక అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసుకొని మెట్రోరైలు సర్వీసులు నడిపేందుకు తాము సిద్ధమని తెలిపారు.  దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో తాము దీనిపై పోరాడుతున్నామని చెప్పారు. ఇప్పటికే అన్ని రైల్వేస్టేషన్లను శానిటైజ్ చేయించి తమ సేవలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.