మారండ్రా అప్‌డేట్ కాండిరా.. వలస కూలీలపై పైశాచికం  - Telugu News - Mic tv
mictv telugu

మారండ్రా అప్‌డేట్ కాండిరా.. వలస కూలీలపై పైశాచికం 

May 23, 2020

Delhi municipal workers sprays chemicals on migrant workers

పొట్టచేతబట్టుకుని  నగారాలకు వెళ్లి, లాక్ డౌన్‌లో బతుకు భారమై ఇళ్లకు చేరుతున్న వలస కూలీలపై దుర్మార్గాలకు తెరపడ్డం లేదు. వారిని జంతువులకంటే హీనంగా చూస్తున్న అధికారులు పిచికారీలను ఆపడం లేదు. కోర్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా దేశంలో ఎక్కడో ఒక చోట వారిపై ప్రమాదకర మందులను స్ప్రే చేస్తూనే ఉన్నారు. 

తాజగాగా దేశరాజధాని ఢిల్లీలోనే ఈసారి దారుణం జరిగింది. శ్రామిక్‌ రైలులో వచ్చిన వలస కూలీలు కరోనా పరీక్షల కోసం లజ్‌పత్‌ నగర్‌ స్కూలు వద్దకు చేరుకున్నారు. వారిని చూడగానే మునిసిపల్ సిబ్బంది, నేరస్తున్నట్లు కెమిలక్ స్ప్రే చేశారు. పోలీసులు కూడా ఆ చోద్యాన్ని చూస్తుండిపోయారు. ఈ  వీడియో బయటికి రావడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రసాయన పిచికారీ వల్ల శ్వాసకోశాలు దెబ్బతిని, చర్మవ్యాధులు వస్తాయని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. దీంతో ఢిల్లీ అధికారులు వెర్రి వివరణలు ఇస్తున్నారు. పైపులు లోపాల వల్ల కూలీలపైకి తిరిగాయని చెబుతున్నారు. మునిసిపల్ సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే కూలీలపై స్ర్ర్పే చేస్తున్నట్టు స్పష్టంగా కనిపించడంతో మాట మార్చి తమ వాళ్లు పొరపాటు చేశారని అంటున్నారు.