Delhi Murder Case Updates
mictv telugu

శ్రద్ధా ఒక్కతే కాదు..ఇంకా ఎందరో…

November 17, 2022

ఢిల్లీ శ్రద్దా మర్డర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అఫ్తాబ్‌కు శ్రద్దతోపాటు పలువురు మహిళలతో సంబధాలు ఉన్నాయని విచారణలో తెలిసింది. డేటింగ్ యాప్స్ ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకున్నాడు. శ్రద్ధ హత్య తర్వాత ఓఎల్ఎక్స్ లో అఫ్తాబ్ పూనావాలా ఫోన్‌ని అమ్మేశాడు. అఫ్తాబ్ వాడిన ఫోనే ఎంక్వైరీలో కీలకంగా మారబోతుందా?నిందితుడ్ని కస్టడీకి తీసుకుంటే మరిన్ని వివరాలు తెలుస్తాయా?

కేసులో పురోగతి

ఢిల్లీ శ్రద్ధ హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. అఫ్తాబ్‌కు పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని కనుగొన్నారు. డేటింగ్ యాప్స్‌తో ఎంత మంది పరిమయ్యారు?. వారితో ఏం మాట్లాడారు?శ్రద్ధలాగా ఇంకేవారినైనా ఇలాగే చేశాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. డేటింగ్ యాప్స్ మేనేజ్‌మెంట్ నుంచి అఫ్తాబ్ అకౌంట్‌కు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. శ్రద్ధ హత్య తర్వాత ఫోన్‌ని ఓఎల్ఎక్స్‌లో అఫ్తాబ్ అమీన్ పూనావాలా అమ్మేశాడు. ఈ ఫోన్‌ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు. గతంలో వాడిన సిమ్ కార్డుల డేటాను పరిశీలిస్తున్నారు.

నివ్వెరపోయే నిజాలు

శ్రద్ద తండ్రి వికాస్ వాకర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు నిందితుడు అఫ్తాబ్ తొలుత అన్నీ అబద్ధాలే చెప్పాడు. అక్టోబర్ నుంచి విచారణ జరగుతోంది. శ్రద్ధ గొడవ తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు. కానీ ఆమె ఫోన్ , క్రెడిట్ కార్డు లావాదేవీలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఫేస్‌బుక్ , ఇన్ స్టాలో మధ్య మధ్యలో పోస్టింగ్స్ వస్తున్నాయి. అనుమానంతో పోలీసులు బ్యాంక్ లావాదేవీలు , సోషల్ మీడియా అకౌంట్లు పరిశీలించారు. 50 వేలు రూపాయలు శ్రద్ధ అకౌంట్ నుంచి ట్రాన్స్ ఫర్ అయినట్టు గుర్తించారు.అప్పుడు అఫ్తాబ్ చెబుతున్నవి అన్ని అబద్ధాలేనని తేలింది. పోలీసులు తమదైన శైలిలో అడగడంతో శ్రద్దను ఎలా చంపింది బయటపెట్టాడు.

చంపి బాత్రూమ్‌లో..

శ్రద్ధను చంపిన తర్వాత డెడ్ బాడీని బాత్రూమ్‌లోకి తీసుకెళ్లాడు. పదునైన కత్తితో 35 ముక్కలుగా కోశాడు. రక్తాన్ని క్లీన్ చేసేందుకు భారీగా నీటిని వాడాడు. దీంతో ఆ నెల వాటర్ బిల్లు భారీగా వచ్చింది. ఈ బిల్లు కూడా విచారణలో కీలకంగా మారింది. శ్రద్ద శరీరాన్ని ముక్కలుగా చేసే సమయంలో చేతులకు సర్జికల్ గ్లౌజులు వాడాడు. ఎక్కడ పోలీసులకు ఆధారాలు దొరక్కుండా చేశారు. గూగుల్ చేసి వాసన రాకుండా కెమికల్స్‌తో బాత్రూమ్, ఇంటిని క్లీన్ చేశాడు. మెహ్రౌలి ఫ్లాట్‌ని పరిశీలించిన పోలీసులు అతను వాడిన గ్లౌజుల్ని సేకరించి ల్యాబ్‌కు పంపారు.

నిందితుడి మాటలతో…

శ్రద్ద తండ్రి వికాస్ ముందే నిందితుడు హత్య చేసిన తీరు పోలీసులకు చెప్పాడు. “నా ముందే అతను పోలీసులకు వాంగూల్మం ఇచ్చాడు. ఇతను తెలుసా అని పోలీసులు అఫ్తాబ్‌ని అడిగారు..హ తెలుసు…శ్రద్ధ తండ్రి అని చెప్పాడు.శ్రద్ధను చంపేశానని అతను చెప్పాడు. అతని మాటలు విని కుప్పకూలిపోయా..ఇంతకు మించి ఏం వినలేను.నన్ను పక్కకు తీసుకెళ్లండి.ఇప్పుడు ఏం వినే స్థితిలో నేను లేను”అని పోలీసులతో శ్రద్ధ తండ్రి వికాస్ వాకర్ అన్నాడు.