Delhi News 6 months in jail, Rs 200 fine for bursting firecrackers on Diwali in Capital
mictv telugu

దీపావళికి బాణసంచా కొంటే 6 నెలలు జైలు

October 19, 2022

Delhi News 6 months in jail, Rs 200 fine for bursting firecrackers on Diwali in Capital

దీపావళి అంటే ఇదివరకు సంబరం. మతాబులు, చిచ్చుబుడ్లు, కొత్తబట్టలు అబ్బో.. పండగే పండగ. కానీ మారుతున్న కాలాన్ని బట్టి పద్ధతులూ మారుతున్నాయి. కాలుష్యం కారణంతో కొద్దరు బాణసంచా కాల్చడం తగ్గిస్తుంటే కొందరు పర్యావరణానికి హాని చేయని గ్రీన్ కాకర్స్ వాడుతున్నారు.

అయితే అవి ఖరీదు కావడంతో చాలామంది మామూలు టపాసులే కొంటున్నారు. వాటితో కాలుష్యమై పండగ కాబట్టి తప్పడం లేదు. ఈ నేపథ్యంలో దేశానికే కాకుండా కాలుష్యానికి కూడా రాజధాని అయిన ఢిల్లీలో ఈసారి కఠిన ఆంక్షలు విధించారు.దీపావళి నాడు బాణసంచా కాలిస్తే రూ. 200 జరిమానాతోపాటు ఆరు నెలల జైలు శిక్ష పడుతుంది ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం వెల్లడించారు. ‘ఢిల్లీ పేలుడు పదార్థాల చట్టం ప్రకారం బాణసంచాను నిల్వచేసి అమ్మితే రూ. 5 వేల జరిమానా, గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది’ అని ఆయన హెచ్చరించారు. దీపావళి సీజన్ కావడంతో ఢిల్లీ ప్రభుత్వం గత నెల పటాసులపై మళ్లీ నిషేధం పెట్టింది. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంటవ్యర్థాల కాల్చివేత, భారీగా పెరిగిన వాహన ఉద్గారాలతో నగరం కాలుష్యానికి అడ్డాగా మారుతున్న సంగతి తెలిసిందే.