Delhi Police Arrests Man Who Was Declared "Dead" 24 Years Ago,
mictv telugu

చనిపోయిన వ్యక్తిని”24 ఏండ్ల తరువాత అరెస్ట్ చేసిన పోలీసులు.

November 12, 2022

Delhi Police Arrests Man Who Was Declared "Dead" 24 Years Ago

దొంగతనం చేయాలంటే దొంగతనం చేయడమొక్కటే కాదు దాని నుంచి తప్పించుకునే తెలివి తేటలు కూడా ఉండాలి. ఇప్పుడు చెప్పబోయే వ్యక్తివి మామూలు తెలివి తేటలు కావు…చావు తెలివితేటలు. దొంగతనం చేయడమే కాకుండా తర్వాత దాని నుంచి తప్పించుకోవడానికి ఏకంగా తాను చచ్చిపోయాయని ఏకంగా పేపర్లు సృష్టించేసాడు.

దేశ రాజధాని అయిన ఢిల్లీలో జరిగిందీ సంఘటన. 1991లో దొంగతనం జరిగింది, అప్పడు ఢిల్లీ పోలీసులు దొంగ మీద కేసు కూడా పెట్టారు. కానీ కొన్ని రోజులకే అతను చనిపోయాడని తెలిసింది. చనిపోయినట్లు డాక్యుమెంట్లు కూడా దొరికాయి. దాంతో పోలీసులు అతని మీద ఉన్న దొంగతనం కేసును క్లోజ్ చేసేసారు. కానీ 24 ఏళ్ళ తర్వాత ఇప్పడు ఆ దొంగ సడన్ గా దొరికాడు. అది కూడా ఢిల్లీ పోలీసులకు కాదు. బవానా పోలీసులకు.

తీగ లాగితే డొంకంతా కదిలిందని సామెత. బవానా పోలీసులకు ఓ లీడ్ దొరికింది. దాన్ని పట్టుకుని వెళితే సదరు దొంగగారు దొరికారు. చనిపోయినట్లు పేపర్ల మీద సృష్టించేసి అతను మాత్రం హాయిగా ఉంటున్నాడు. దొంగతనం చేసిన సొమ్ముతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. 24 ఏళ్ళపాటూ గడిపేసాడు.

దొంగగారి కేసు కోర్టుకు కూడా వెళ్ళింది అయితే అక్కడ కూడా చనిపోయినట్లు పేపర్లు చూపించడంతో అక్కడ కూడా కేసు కొట్టేసారు. మొత్తానికి ఇప్పడు మళ్ళీ దొంగ దొరకడంతో అతని మీద కేసును తిరగరాస్తున్నారు. అంతేకాదు చనిపోయినట్లు ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించి తప్పించుకున్నందుకు కూడా కేసు వేశారు ఢిల్లీ పోలీసులు.

చెడ్డపని చేస్తే ఎప్పటికైనా శిక్ష పడకతప్పదు అన్నదానికి ఉదాహరణ ఈ కేసు. ఈరోజు తప్పించుకోవచ్చు కానీ చనిపోయేలోపు మాత్రం శిక్ష తప్పదు.