ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలపై పోలీస్ కేసు - MicTv.in - Telugu News
mictv telugu

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలపై పోలీస్ కేసు

October 29, 2020

MLA

ఢిల్లీ పోలీసులు నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పార్టీ ఎమ్మెల్యేలపై ఐపీసీ సెక్షన్ 186, 188, 353, 332, 269,270, ఎపిడమిక్ యాక్ట్ సెక్షన్ 3ల కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీలో పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఆప్‌కు చెందిన కొండ్లీ ఎమ్మెల్యే కుల్దీప్ మోను, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే వందనా కుమారి, మోడల్ టౌన్ ఎమ్మెల్యే అఖిలేష్ త్రిపాఠి, త్రిలోక్ పురి ఎమ్మెల్యే రోహిత్ మహ్లీయాన్‌లపై పోలీసులు కేసులు పెట్టారు. 

పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాథక్ 1500మంది ప్రజలతో పౌరకేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎలాంటి అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం చేపట్టారని, దీంతోపాటు కరోనా వైరస్ మార్గదర్శకాలను పాటించలేదని పోలీసులు వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమంలో నలుగురు ఆప్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించగా నిరసనకారుల ప్రతిఘటనతో కమలా మార్కెట్ ఏసీపీతోపాటు 9మంది పోలీసులు గాయపడ్డారు.