Delhi: Police Finally Lodge FIR Against Girls’s PG Hostel Guard
mictv telugu

లేడీస్ హాస్టల్‌లో కామపిశాచి.. ఓ అమ్మాయిని ఇలా..

August 17, 2022

తాగిన మత్తులో లేడీస్ హాస్టల్‌లోకి జొరబడి అక్కడున్న యువతులను భయపెట్టాడు అదే హాస్టల్ లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు. అంతేకాకుండా ఓ యువతిపై లైంగికదాడికి కూడా పాల్పడ్డాడు. సెంట్రల్‌ ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో జరిగిన ఈ ఘటన సీసీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఓ యువతిపై దాడి చేస్తూ కెమెరాకు చిక్కాడు ఆ సెక్యూరిటీ గార్డు. హాస్టల్‌ కారిడార్‌లోంచి వరుసగా వెళ్తున్న యువతులు.. మద్యం మత్తులో లోపలికి వచ్చిన సెక్యూరిటీ గార్డును చూసి ఒక్కసారిగా వెనక్కి పరుగులు తీశారు.

వారిలో ఒక యువతిని అమాంతం గట్టిగా పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దాడికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై హాస్టల్‌ ఓనర్‌ ఫిర్యాదు చేసినప్పటికీ.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. సీసీ టీవీ ఫుటేజీ కాస్తా వైరల్ అయి ఢిల్లీ ఉమెన్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ దృష్టికి చేరింది. దీంతో ఈ వీడియోను ఆమె ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. నిందితుడిని అరెస్ట్‌ చేయాలని , ఢిల్లీ పోలీసులకు కోరారు. అంతేకాదు గురువారం సాయంత్రం కల్లా ఘటనపై పూర్తి నివేదికను అందించాలని గడువు విధించారు.

అయితే బాధితురాలు ఫిర్యాదుకు ముందుకు రాకపోవడంతో.. న్యాయ సలహా మేరకు వీడియో ఆధారంతో ఈ ఘటనను సుమోటాగా స్వీకరించామని, ఎఫ్ఐఆర్‌ నమోదు చేశామని ఢిల్లీ సెంట్రల్‌ డిస్ట్రిక్‌ డీసీపీ శ్వేతా చౌహాన్‌ వెల్లడించారు.