ఇదే అత్యధికం.. లారీ రూ. 1.41 లక్షల జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

ఇదే అత్యధికం.. లారీ రూ. 1.41 లక్షల జరిమానా

September 11, 2019

Delhi Police

ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై ఢిల్లీ పోలీసులు జరిమానాలతో మోత మోగిస్తున్నారు. ఇప్పటి వరకు వేల రూపాయలకే పరిమితమైన ఫైన్లు ఇప్పుడు లక్షలకు చేరింది. రాజస్థాన్‌లో ఓ లారీకి ఏకంగా రూ. 1.41 లక్షల జరిమానా విధించారు పోలీసులు. కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో జరిమానా విధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. 

రాజస్థాన్‌కు చెందిన భగవన్ రామ్‌కు చెందిన లారీ సెప్టెంబర్ 5న  ఓవర్ లోడింగ్‌తో వెళ్తుండగా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఆపి తనిఖీలు చేయగా నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించి లారీని సీజ్ చేశారు. సరైన పత్రాలు లేకపోవడం, వివిధ ట్రాఫిక్ నిబంధనల కింద మొత్తం రూ. 1.41 లక్షల జరిమానా విధించారు. అయితే అంత మొత్తం చెల్లించడానికి 5 రోజులు గడువు తీసుకున్న యజమాని చివరికి ఆ మొత్తం కట్టి తన వాహనాన్ని విడిపించుకెళ్లాడు. కాగా సెప్టెంబర్ 3న ఓ ట్రాక్కు ఓవర్ లోడ్‌తో వెళ్తుండగా గుర్తించిన పోలీసులు రూ. 86,500 ఫైన్ వేసిన సంగతి తెలిసిందే.