ఉల్లి వ్యాపారి అరెస్ట్.. ఆరా తీస్తే.. వెయ్యి కోట్ల స్కాం - MicTv.in - Telugu News
mictv telugu

ఉల్లి వ్యాపారి అరెస్ట్.. ఆరా తీస్తే.. వెయ్యి కోట్ల స్కాం

March 26, 2022

vvvv

అతని పేరు పునీత్ భరద్వాజ్. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉల్లిపాయల వ్యాపారం చేస్తుంటాడు. ఒకరోజు ఉన్నట్టుండి ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని స్థానికులు అడుగగా.. పోలీసులు చెప్పిన విషయాలు విని వారు షాకయ్యారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఢిల్లీలో వెయ్యి కో ట్ల రూపాయల స్కాం చేశాడు. అరెస్ట్‌కు భయపడి నాసిక్‌కు పారిపోయి వచ్చాడు. నాసిక్ ప్రజల అటెన్షన్‌ను ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్న ఈ సంఘటన వివరాల్లోకెళితే.. ఢిల్లీకి చెందిన పీయూష్ తివారీ అనే వ్యక్తి 2011లో ఓ నిర్మాణ కంపెనీ నెలకొల్పాడు. అనంతరం అనేక దొంగ కంపెనీలు క్రియేట్ చేసి అనేక మోసాలకు పాల్పడ్డాడు. అవినీతి, మోసం వంటి ఆరోపణల నేపథ్యంలో అతని ఇంటిపై ఐటీ దాడులు జరుపగా, రూ. 120 కోట్లు దొరికాయి. అయినా తీరు మార్చకోని పీయూష్.. ప్లాట్లిప్పిస్తా, ఫ్లాట్లిప్పిస్తా అంటూ పలువురి దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు. అనంతరం వాటిని తీసుకొని పారిపోయి నాసిక్ వచ్చేశాడు. లబోదిబోమన్న బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో అతనిపై 30 కేసులు నమోదు చేశారు. అప్పటినుంచి నిందితునిపై నిఘా వేసిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నాసిక్‌లో పట్టుకున్నారు. అతనికి సహకరించిన అతని భార్య శిఖాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.