కరోనా కాటుకు పోలీసు బలి.. 14 రోజులుగా నరకం - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా కాటుకు పోలీసు బలి.. 14 రోజులుగా నరకం

July 1, 2020

nhvm vnb

తన,మన భేదాలను కరోనా ఏ మాత్రం చూపడం లేదు. ఉన్నోడు.. లేనోడు అనే కరుణ అంతకంటే లేదు. ఎవరికైనా తనకు ఒక్కటేనని, తాను సోకానంటే ఎంతటి వారినైనా ఆపసోపాలు పెడతానని అంటోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పరిస్థితి చేయిదాటుతూనే ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. కోవిడ్ పోరులో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉన్న డాక్టర్లు, వైద్యసిబ్బంది, పోలీసులకు వైరస్ అంటుకుంటూనే ఉంది. తాజాగా ఈ మహమ్మారి పోలీసు శాఖలో విషాదం నింపింది. కరోనా కాటుకు ఎస్సై బలి అయ్యాడు.

ఢిల్లీ పోలీస్‌ స్పెషల్ సెల్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ సంజీవ్ కుమార్ యాదవ్‌కు ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతడు గత 14 రోజులుగా సాకేత్‌లోని మాక్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నాడు. అయినా కూడా ఏ మాత్రం కుదుట పడలేదు. ఆ తర్వాత వైద్యులు ప్లాస్మా థెరపీ కూడా చేశారు. అది  కూడా పని చేకపోవడంతో ప్రాణాలు వదిలాడు. ఈ విషయం పోలీసు శాఖను కుదిపేసింది. కరోనా విధి నిర్వహణలో ఉన్న ఆయన ఇలా విగత జీవిగా మారడంతో తోటి సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. కాగా విధి నిర్వహణలో చురుగ్గా ఉన్నందకు సంజీవ్ ఈ ఏడాది జనవరిలో పోలీసు పతకాన్నికూడా అందుకున్నారు. దీంతో అతని కుటుంబంలో ఈ సంఘటన తీవ్ర విషాదం నింపింది.  కాగా ఇప్పటికే అక్కడ 87,360 మంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.