ఢిల్లీ నడిరోడ్డులో మహిళపై ఎస్సై కాల్పులు - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీ నడిరోడ్డులో మహిళపై ఎస్సై కాల్పులు

September 28, 2020

 mbhmbh

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఓ మహిళను ఎస్సై గన్‌తో కాల్పులు జరిపాడు.  అలీపూర్‌ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పులేదని వైద్యులు వెల్లడించారు. బాధితురాలికి ఎస్సైకి చాలా కాలంగా వివాహేతర సంబంధం ఉందని తేలింది. 

లాహోరీ గేట్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న సందీప్‌ దహియా  కొంత కాలంగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇద్దరూ కలిసి అలీపూర్‌లో కారులో ప్రయాణిస్తుండగా గొడవ జరిగింది. ఆగ్రహంతో సందీప్ ఆమెపై కాల్పులు జరిపాడు. దీన్ని అక్కడే విధుల్లో ఉన్న మరో ఎస్సై  జైవీర్‌ గుర్తించి ఓ ప్రైవేట్‌ వాహనంలో ఆసుపత్రికి తరచడంతో ప్రాణాపాయం తప్పింది. గొడవకు గల కారణాలేంటి అనే  కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.