తీహార్ జైల్లో దారుణం.. పగతో ఖైదీ హత్య  - MicTv.in - Telugu News
mictv telugu

తీహార్ జైల్లో దారుణం.. పగతో ఖైదీ హత్య 

September 26, 2020

Delhi: Prisoner stabbed to death by fellow inmate at Tihar Jail over 'gang rivalry'

దేశ రాజధానిలోని తీహార్ జైలులో దారుణం చోటు చేసుకుంది. ఒక ఖైదీని మరో ఖైదీ పొడిచి దారుణంగా హతమార్చాడు. మృతదేహం కడుపుపై కత్తిపోట్లు ఉన్నట్లుగా గుర్తించారు. తీహార్‌ జైలులోని నంబర్ 1 జైలు సమీపంలో ఖైదీపై పదునైన కత్తిని ఉపయోగించి మరో ఖైదీ దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఖైదీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ముఠా శతృత్వం కారణంగా హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడిని జైలు శిక్ష అనుభవిస్తున్న 37 ఏళ్ల సికందర్‌గా గుర్తించగా, నిందితుడిని సఫన్‌గా గుర్తించారు. ఈ హత్య వెనుక ఉద్దేశం స్పష్టంగా తెలియలేదని పోలీసులు స్పష్టంచేశారు. ముఠా శత్రుత్వమే హత్యకు కారణం అని కూడా చెప్పలేమని అన్నారు. 

ఈ ఘటన గురించి తెలుసుకోవడానికి ఇతర ఖైదీలను ప్రశ్నిస్తున్నట్లు జైలు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఏడాది జూన్‌లో మైనర్ బాలికపై లైంగికదాడి చేసిన ఘటనలో  నిందితుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు తీహార్ జైలుకు వచ్చిన బాధితురాలి కుటుంబసభ్యుడు అదను చూసి హత్య చేశాడని జైలు సిబ్బంది గుర్తుచేసుకున్నారు.