ఢిల్లీ రేయాన్ స్కూల్లో దారుణ హత్యకు గురైన ఏడేళ్ల ప్రద్యుమ్న్ ఠాకూర్ ఉదంతాన్ని మరవరక ముందే మరో స్కూల్లో హత్య జరిగింది. కరవాల్ నగర్‌లోని జీవన్ జ్యోతి సెకండరీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న తుషార్ కుమార్ అనే విద్యార్థి బాత్రూమ్లో శవమై కనిపించాడు. అతన్ని తోటి విద్యార్థులు హత్య చేసినట్లు భిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు.
14 ఏళ్ల తుషార్ గురువారం ముగ్గురు విద్యార్థులతో గొడవ పడినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా తెలుస్తోంది. ఆ ముగ్గురు విద్యార్థులు తుషార్‌ను తీవ్రంగా కొట్టి, బాత్రూం వద్దకు తీసుకెళ్లారు. వారే అతణ్ని చంపేసినట్లు భావిస్తున్నామని, అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. అయితే, ఇది హత్య కాదని, తుషార్ అనారోగ్యంతో చనిపోయాడని స్కూలు యాజమాన్యం చెబుతోంది.
కానీ తన బిడ్డను హత్యను చేశారని తుషార్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పరీక్షలు వాయిదా పడేందుకు వీలుగా ఢిల్లీలో విద్యార్థులు ఇటీవల ఘోరాలకు తెగబడ్డారు. ప్రద్యుమ్న్ అను అలాగే చంపేసినట్లు వార్తలు వచ్చాయి. మరో స్కూల్లో ఒక విద్యార్థిపై దాడి చేశారు.