దేశ రాజధానిలో అగ్ని ప్రమాదం.. 1500 గుడిసెలు దగ్ధం - MicTv.in - Telugu News
mictv telugu

దేశ రాజధానిలో అగ్ని ప్రమాదం.. 1500 గుడిసెలు దగ్ధం

May 26, 2020

jke

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1500 పూరి గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి.  తుగ్లక్‌బాద్‌ మురికివాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో భారీగానే ఆస్తి నష్టం జరిగినా.. ఎటువంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 28 ఫైర్ ఇంజన్లు ప్రమాద స్థలానికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. దీంతో వేలాది మంది పేదల జీవితాలు రోడ్డుపాలయ్యాయి. కట్టుబట్టలతో సహా అర్ధరాత్రి నుంచి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.  

రాత్రి సమయంలో  జనమంతా నిద్రలో ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. దీన్ని గుర్తించిన వెంటనే స్థానికులు అప్రమత్తమై అంతా బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయం మాత్రం తెలియలేదు. దీనిపై విచారణ ప్రారంభించామని పోలీసులు వెళ్లడించారు.  బాధితుల కోసం సెల్టర్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.