ఢీకొట్టి పారిపోయిన స్కార్పియో పిరికిపంద.. - MicTv.in - Telugu News
mictv telugu

ఢీకొట్టి పారిపోయిన స్కార్పియో పిరికిపంద..

June 6, 2022

పెద్దపెద్ద కార్లున్న వారిలో కొందరికి అహంకారం విషంలా తెలకెక్కి పాముల్లా బుసకొడుతుంటారు. పెద్దబండితో ఏం చేసిన చెల్లుతుందని విర్రవీగుతుంటారు. అమాయకులను గుద్ద చంపి పైశాచికానందం పొందుతున్నారు. జైలుకెళ్లినా పలుకుబడితో బయటికొచ్చేస్తుంటారు. ర్యాష్ డ్రైవింగ్ చేయడమే కాక, తప్పుబట్టిన బైక్ రైడర్‌ను ఓ స్పోర్ట్స్ వెహికల్ డ్రైవర్ ఢీకొట్టి పారిపోయాడు. నిలబడి మాట్లాడే దమ్ము ధైర్యం లేక పిరికిపందలా తోకముడిచాడు. ఢిల్లీలోని అర్జనఘర్ మెట్రో స్టేషన్ వద్ద ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. కొందరు స్నేహితులు గురుగ్రామ్ వెళ్లి తిరిగి నగరానికి వస్తుండగా స్కార్పియో వాహనం వారి పక్క నుంచి మితిమీరిన వేగంతో ర్యాష్‌గా ఉంది. బైకర్లు ఆ కారు డ్రైవర్‌ను ఇది పద్ధతి కాదని మందలించారు. అతడు తలబిరుసుగా సమాధానం ఇచ్చాడు. ఈ ఉదంతాన్ని బైకర్లలో ఒకరు సెల్ ఫోన్లో రికార్డు చేస్తుండగా ఆ డ్రైవర్ కారును వేగంగా ముందుకు పోనిచ్చి ఓ బైకర్ ను ఢీకొట్టి పారిపోయాడు. కింద పడిన బైకర్ కు అదృష్టం కొద్దీ పెద్ద గాయాలేమీ కాలేదు. దురదృష్ట వశాత్తూ అతనికేమైనా జరిగి ఉంటే ఆ పాపం స్కార్పియోదే అయ్యేది. వీడియోను బైకర్లు సోషల్ మీడియాలో పెట్టడంతో పోలీసులు పిరికిపంద కోసం గాలిస్తున్నారు.