Delhi state liquor scam Hyderabad businessman abhishek rao arrest
mictv telugu

లిక్కర్ స్కామ్‌లో అభిషేక్ రావు అరెస్ట్

November 14, 2022

దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న మద్యం కుంభకోణంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యాపారులు, రాజకీయ నాయకులు అరెస్టవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి బోయినపల్లి అభిషేక్ రావును ఎన్‌ఫోర్స్‌మెంట్(ఈడీ) పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రిః సిసోడియా సన్నిహితుడు విజయ్ నాయర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. బెయిల్ కోసం వీరు పెట్టుకున్న దరఖాస్తుపై సోమవారం ఢిల్లీ తీర్పు వెలువడనున్న నేపథ్యంలో అరెస్ట్ కావడం గమనార్హం.

స్కాంలో విజయ్ నాయర్ కీలక నిందితుడని ఈడీ అనుమాన4స్తోంది. ఇతడు పాత నేరస్తుడు. ఆప్ పార్టీకి సన్నిహితుడైన నాయర్ ఢిల్లీ రాష్ట్ర మద్యం లైసెన్సుల్లో అక్రమాలకు పాల్పడ్డారని రోపణలు ఉన్నాయి. ఇక అభిషేక్ రావు తెలంగాంణ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రాబిన్ డిస్టిలరీస్, అనూస్‌ బ్యూటీ కేర్‌ సహా 9 కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్న అభిషేక్ రావు సరిగ్గా విచారిస్తే బడా నాయకుల పేర్లు బయటికి వస్తాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ టెండర్లను దక్కించుకోవడానికి నిందితులు సిండికేట్‌గా ఏర్పడి నగదు కోసం హవాలా రాకెట్ నడిపారని ఆరోపణలు ఉన్నాయి.