Delhi: Tihar jail inmate swallows four 'mobile phones'; doctors removed 2
mictv telugu

ఖైదీ చావు తెలివి.. జైల్లో ‘కడుపు’తో బిజినెస్ చేయబోయి ప్రాణాలపైకి…

September 9, 2022

చేసిన తప్పుడు పనుల కారణంగా జైలు పాలయ్యాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా బుద్ధి మార్చుకోలేదు. మరో తింగరిపని చేసి ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ.. ఇటీవల పెరోల్‌పై బయటకు వెళ్లాడు. ఆ సమయంలో అతడికి తిరిగి జైలుకు వెళ్లాక.. జైల్లో డబ్బు సంపాదించాలనే ఆశ పుట్టింది. అందుకోసం ఓ ప్లాన్ వేశాడు. తోటి ఖైదీలకు ఏదైనా వస్తువులను అమ్మి డబ్బు చేసుకోవాలనుకున్నాడు. ప్లాన్ ప్రకారం 5 సెం.మీ కంటే తక్కువ నిడివి ఉన్న 4 మొబైల్ ఫోన్‌లను మింగేశాడు. తిరిగి అతడు జైలుకు వచ్చినప్పుడు అతడు సెల్‌ఫోన్లు మింగిన విషయాన్ని సిబ్బంది గుర్తించలేకపోయారు. దీంతో తన ప్లాన్ వర్కవుట్ అయ్యిందని భావించాడా ఖైదీ. ఈ క్రమంలో లోనికి వెళ్లిన తర్వాత.. ఆ సెల్‌ఫోన్లను బయటకు తీసేందుకు 2-3 రోజులపాటు విశ్వప్రయత్నం చేశాడు. కానీ ఆ సెల్ ఫోన్లు బయటకు రాలేదు.

చివరకి అతడికి కడుపులో నొప్పి రావడం ప్రారంభమైంది. దీంతో ప్రాణభయంతో అతడు విషయాన్ని అధికారులకు చెప్పాడు. కానీ ఎవ్వరూ అతడిని నమ్మలేదు. అతడి పరిస్థితిని పట్టించుకోకుండా చేస్తున్నావా అంటూ సీరియస్ అయ్యారు. నొప్పితో అతడు విలవిల్లాడుతూ ఉండటంతో.. వెంటనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఎండోస్కోపీ చేసి, అతని కడుపులో ఒకటి కంటే ఎక్కువ ఫోన్‌లు ఉన్నాయని గ్రహించారు. బుధవారం సర్జరీ చేసి.. 2 సెల్ ఫోన్లను రిమూవ్ చేశారు. మిగిలిన రెండు ఫోన్‌లు పొత్తికడుపుకు చేరుకున్న క్రమంలో.. స్పెషలిస్ట్‌ టీమ్ మరో సర్జరీ చేయనుందని తీహార్ డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ తెలిపారు.