సినీ ఫక్కీలో బానెట్ పై ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను వేసుకొని పరార్ - MicTv.in - Telugu News
mictv telugu

సినీ ఫక్కీలో బానెట్ పై ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను వేసుకొని పరార్

October 15, 2020

Dhaula Kuan

ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వచ్చిన ఓ వ్యక్తి పోలీసులకు చుక్కలు చూపించాడు. ఏ మాత్రం వారిని లెక్కచేయకుండా ట్రాఫిక్ పోలీసుపైకి కారును పోనిచ్చాడు. సినీ ఫక్కీలో కానిస్టేబుల్ బానెట్‌పై పోడిపోయి కారును ఆపే ప్రయత్నం చేశారు. కానీ అతడు వేగంగా అటూ ఇటూ తిప్పడంతో కిందపడిపోయాడు. పెద్ద ఎత్తున వాహనాలు వస్తున్న సమయంలో రోడ్డుపై కొంతసేపు గందరగోళం ఏర్పడింది. ఢిల్లీలోని దౌలా కౌన్ ప్రాంతంలో ఈ ఘటన ఈ నెల 12న ఇది జరిగింది. 

కారులో వస్తున్న ఓ వ్యక్తిని తనిఖీల కోసం పోలీసులు ఆపారు. కానీ అతడికి కోపం వచ్చి ఆపడకుండా ముందుకు దూసుకుపోవాలనుకున్నాడు. అప్పటికే కారు ముందు ఓ కానిస్టేబుల్ నిలబడి ఉన్నాడు. దాన్ని ముందుకు పోనివ్వడంతో అతడు బానెట్ పై పడిపోయాడు. కారును వేగంగా పోనిస్తూ.. అటూ ఇటూ తిప్పడంతో పట్టుతప్పి ట్రాఫిక్‌లో వాహనాల మధ్యలో పడిపోయాడు. కానీ అతడికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అక్కడే ఉన్న సీసీ కెమెరాకు చిక్కిన వీడియో ఆధారంగా అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.