డెలివరీ బాయ్‌ని 20సార్లు పొడిచింది.. కారణం తెలిస్తే షాక్! - MicTv.in - Telugu News
mictv telugu

డెలివరీ బాయ్‌ని 20సార్లు పొడిచింది.. కారణం తెలిస్తే షాక్!

March 29, 2018

మనుషులు ఉద్వేగాలను అదుపులో పెట్టుకోలేకపోతున్నారు. ఏవేవో గొడవలు, అసంతృప్తులతో కనిపించినవారిపై కస్సుమంటున్నారు. ఢిల్లీలో ఒక మహిళ ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్ని 20 సార్లు కత్తితో పొడిచేసింది. బాధితుణ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ దారుణం ఢిల్లీలోని నిహల్‌ విహార్‌లో చోటుచేసుకుంది. కమల్ దీప్ అనే 30 ఏళ్ల మహిళ  ఫ్లిప్‌కార్ట్‌లోస్మార్ట్‌ఫోన్‌ కొన్నది. కేశవ్(28) అనే డెలివరీ బాయ్‌ ఆ ఫోన్ తీసుకొచ్చాడు. అయితే చాలా ఆలస్యంగా తెచ్చాడని కమల్ అతనితో గొడవ పెట్టుకుంది. అతడు ‘మేడం.. ట్రాఫిక్ వల్ల ఆలస్యమైంది. వేరే డెలివరీలు ఉన్నాయి.. ’ అని వివరణ ఇచ్చినe పట్టించుకోకుండా దూషణకు దిగింది. గొడవ ముదిరింది. కమల్ తరఫున ఆమె సోదరుడు కూడా బరిలోకి దిగాడు.  కమల్ ఆగ్రహం పట్టలేక ఇంట్లోకెళ్లి కత్తిని తీసుకొచ్చి కేశవ్ ను 20సార్లు కత్తితో పొడిచింది. అతడు కుప్పకూలిపోయాడు. ఈ ఘోరం సీసీటీవీలో రికార్డయింది. పోలీసులు కమల్‌ను, ఆమె సోదరుణ్ని అరెస్ట్ చేశారు.